Site icon NTV Telugu

Ram Charan: గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్ లో చరణ్.. రాయల్ లుక్ లో ఏమున్నాడు

Charan

Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వారు సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ విజువ‌ల్ వండ‌ర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కలక్షన్ల సునామీ సృష్టించడమే కాకుండా లెక్కలేనన్ని అవార్డులను అందుకుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ రేసులో పోటీ పడుతోంది. ఇక ఇటీవలే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరి కింద నాటు నాటు సాంగ్‌.. అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయ్యింది.

జనవరి 11న లాస్ ఏంజిల్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్య‌క్ర‌మానికి రామ్ చ‌ర‌ణ్‌, ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ హాజ‌రు కానున్నారు. ఇక ఈ ఈవెంట్ లో చరణ్ రాయల్ లుక్ లో మెరవనున్నట్లు తెలుస్తోంది. ఆ ఈవెంట్ కు హాజరుకావడం కోసం చరణ్ డిజైన్ చేయించిన డ్రెస్ తో చరణ్ ఇదుగో ఇలా పోజులిచ్చాడు. బ్లాక్ క‌ల‌ర్ రాయ‌ల్ సూట్ మీద ఆర్ఆర్ఆర్ పేరు ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ప్ర‌తి ఏడాది ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా జ‌రిగే ఆస్కార్ అవార్డుల‌కు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను క‌ర్ట‌న్ రైజ‌ర్‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. మరి ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ నిలుస్తుందా..? లేదా..? అనేది తెలియాలి

Exit mobile version