Ram Charan: గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్ లో చరణ్.. రాయల్ లుక్ లో ఏమున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వారు సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్, చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం కలక్షన్ల సునామీ సృష్టించడమే కాకుండా లెక్కలేనన్ని అవార్డులను అందుకుంది. ఇంటర్నేషనల్ రేంజ్ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ రేసులో పోటీ పడుతోంది. ఇక ఇటీవలే ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి కింద నాటు నాటు సాంగ్.. అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ నామినేట్ అయ్యింది.
జనవరి 11న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమానికి రామ్ చరణ్, ఎస్.ఎస్.రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఇక ఈ ఈవెంట్ లో చరణ్ రాయల్ లుక్ లో మెరవనున్నట్లు తెలుస్తోంది. ఆ ఈవెంట్ కు హాజరుకావడం కోసం చరణ్ డిజైన్ చేయించిన డ్రెస్ తో చరణ్ ఇదుగో ఇలా పోజులిచ్చాడు. బ్లాక్ కలర్ రాయల్ సూట్ మీద ఆర్ఆర్ఆర్ పేరు ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ప్రతి ఏడాది ఎంతో ప్రెస్టీజియస్‌గా జరిగే ఆస్కార్ అవార్డులకు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను కర్టన్ రైజర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. మరి ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ నిలుస్తుందా..? లేదా..? అనేది తెలియాలి
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!