NTV Telugu Site icon

RC16 : మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ 16’ టైటిల్ ఇదేనా..?

Rc16

Rc16

గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో మెగాభిమానులను డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా ఆర్సీ 16ని డిజైన్ చేసుకున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఆర్సీ 16 ఉంటుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్రకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్‌తో ఈ సినిమా రూపొందనుందనే ప్రచారం కూడా జరిగింది. కోడి రామ్మూర్తి మల్ల యోధుడిగా ఫేమస్. దీంతో ఆర్సీ 16 కథా నేపథ్యం కుస్తీ బ్యాక్ డ్రాప్‌ అని ఊహిస్తున్నారు ఫ్యాన్స్.

Also Read : NANI : నాని సాలిడ్ లైనప్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే..?

కానీ రీసెంట్‌గా ఈ సినిమా క్రికెట్ ఆట‌ను బేస్ చేసుకుని తెర‌కెక్కిస్తున్నట్టుగా తెలిసింది. ఈ విష‌యాన్ని కెమెరామెన్ ర‌త్న‌వేలు స్వ‌యంగా రివీల్ చేసాడు. అయితే కథ రీత్యా ఇందులో రెండు క్రీడలు కీలకంగా ఉంటాయట. ప్రధమార్ధం అంతా క్రికెట్‌ నేపథ్యంలో కథ సాగుతుందట. ద్వితీయార్ధంలో కుస్తీ కీలకంగా ఉంటుందట. అందుకే అటు కుస్తి ఇటు క్రికెట్‌ కలిసొచ్చేలా ‘పవర్‌ క్రికెట్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని సమాచారం. అసలు క్రికెట్, కుస్తీని బుచ్చిబాబు ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది పక్కన పెడితే ఒకే సినిమాలో రెండు ఆటలు అనేకాన్సెప్ట్ తో ఫ్యాన్స్ అంచనాలు అమాంతం పెరిగాయి. ఒకవేళ ఇదే నిజమైతే చరణ్ కొట్టే సిక్సులకు పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవనుంది. చరణ్ పట్టే కుస్తీ పట్టుకి లెక్కలు మారతాయి అని అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఆర్సీ 16 ఫస్ట్ లుక్‌తో పాటు ‘పవర్ క్రికెట్’  టైటిల్‌ గ్లింప్స్‌ను రామ్‌చరణ్ పుట్టిన రోజైన మార్చి 27న ఎనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి.