NTV Telugu Site icon

Ram Charan: లాస్ ఏంజిల్స్ కి ‘అల్లూరి సీతా రామరాజు’

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసనాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గ్రీన్ టీషర్ట్ లో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. జనవరి 11న లాస్ ఏంజిల్స్ లో జరగనున్న 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి చరణ్ కూడా కనిపించనున్నాడు. ఈ ఈవెంట్ కోసం ఫ్యామిలీతో పాటు లాస్ ఏంజిల్స్ వెళ్తున్న సమయంలోనే చరణ్ ఫోటోలు బయటకి వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా రెండు కేటగిరిల్లో నామినేట్ అయ్యింది. బెస్ట్ ఫీచర్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ సాంగ్ కేటగిరిల్లో నామినేట్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ‘బెస్ట్ సాంగ్’ కేటగిరిలో అవార్డ్ గెలుచుకునే అవకాశం ఉంది. వరల్డ్ లోని ది బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ హాజరు కానున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్ లో ఆర్ ఆర్ ఆర్ టీం ఇండియన్ జెండాని ఎగరెయ్యాలని ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కోరుకుంటున్నారు. ఇదే జరిగితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఆస్కార్ రేస్ ఈజీ అవుతుంది. ఇదిలా ఉంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఈవెంట్ కన్నా ముందు చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలు మరో ప్రెస్టిజియస్ స్టేజ్ పైన కలిసి కనిపించనున్నారు.

Read Also: Largo Winch: సీడీలు ఇస్తే చరణాలు వేసి ఇస్తారు…

జనవరి 9న వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐమాక్స్ అయిన TCL చైనీస్ థియేటర్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరగనుంది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి సంబంధించిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి అంటే మన సినిమాకి వెస్ట్ లో ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. టికెట్ సేల్స్ స్టార్ట్ చేసిన నిమిషమున్నర లోపే అన్ని టికెట్స్ అమ్ముడైపోయాయి అంటూ అఫీషియల్ గా ప్రకటించారు. ఒక ఇండియన్ సినిమా టికెట్స్ ఇంత త్వరగా బుక్ అవ్వడం ఇదే మొదటిసారి అంటూ ‘బియాండ్ ఫెస్ట్’ ట్వీట్ చేసింది. ఈ స్పెషల్ స్క్రీనింగ్ అయిన తర్వాత చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలు Q&A సెషన్ లో పాల్గొననున్నారు.

Read Also: Sushanth Singh Rajputh: సుశాంత్ ఉరేసుకున్న ఫ్లాట్ అద్దెకు.. ఎన్ని లక్షల్లో తెలుసా..?