Site icon NTV Telugu

Ram Charan: ఫోర్బ్స్ మ్యాగజైన్ పై మెగా కపుల్.. ఫోటో వైరల్

Mega

Mega

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు అరుదైన గౌరవం అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ జంట దర్శనమిచ్చారు. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ జంట ఇలా ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించింది లేదు. మొదటిసారి ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు రామ్ చరణ్ దంపతులు. ఇక ఈ ఇంటర్వ్యూలో వారి ప్రేమ కథ, వైవాహిక జీవితంలో ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకున్నారు.. అన్ని పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఫొటోలో పింక్ కలర్ డిజైనర్ డ్రెస్ ల్లో చరణ్, ఉపాసన ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఉపాసన సోఫాలో కూర్చోగా.. ఆమె ఒడిలో చెయ్యి పెట్టి నేలపై చరణ్ కూర్చున్న విధానం ఎంతో అద్భుతంగా ఉంది. ఇక ఈ ఇంటర్వ్యూలో వీరి జీవితంలోకి క్లింకార వచ్చాకా జరిగిన మార్పులను వారు వివరించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. పొలిటికల్ సెటైర్ గా ఈ సినిమాను శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి.. కుటుంబంతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న చరణ్.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version