అన్నా…. ఆ వెనుకే తమ్ముడు!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టి, థియేటర్లు ఓపెన్ గానే వచ్చిన మొదటి పెద్ద సినిమా సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఆ మూవీ సూపర్ హిట్ కాకపోయినా… జనాలు థియేటర్ల వరకూ ధైర్యంగా వెళ్ళడానికి కారణమైంది. దాంతో జనవరిలో వచ్చిన సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. విశేషం ఏమంటే… ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని టాలీవుడ్ హీరోలంతా తమ సినిమా అన్నట్టు ఓన్ చేసుకుని ప్రచారం చేశారు. ఇక ఈ యేడాది ఫిబ్రవరిలో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ విడుదలైంది. సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగా స్టార్ చిరంజీవితో మొదలు పెట్టి మెగా ఫ్యాన్స్ అంతా భుజానకెత్తుకుని ప్రచారం చేశారు. దాంతో తొలి చిత్రంతోనే వైష్ణవ్ తేజ్ రికార్డులను నమోదు చేసుకున్నాడు. విశేషం ఏమంటే.. ఈ యేడాది ద్వితీయార్థంలో ఈ అన్నదమ్ముల ఇద్దరి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి.
సాయిధరమ్ తేజ్ నటించిన పొలిటికల్ అండ్ బ్యూరోక్రాట్ డ్రామా ‘రిపబ్లిక్’. ఇందులో పంజా అభిరామ్ అనే ఐఎఎస్ పాత్రను సాయితేజ్ పోషించాడు. తన కెరీర్ లోనే మనసుకు ఎంతో దగ్గరైన పాత్ర ఇదని సాయితేజ్ చెబుతున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 1న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కాబోతోంది. కెరీర్ ప్రారంభంలోనే ‘ప్రస్థానం’ వంటి పొలిటికల్ మూవీని తెరకెక్కించిన దేవా కట్ట ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకగా రూపొందించాడు. ఇక సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా ‘కొండపొలం’ను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేశాడు. ప్రముఖ రచయిత అన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఈ సినిమాకు ఆధారం. క్రిష్ సొంత బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. రకుల్ ఈ మూవీలో నాయికగా నటించింది. ఆలోచనాత్మక కథాంశాలతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రావడం ఓ విశేషం అయితే… మెగా కాంపౌండ్ లోని ఇద్దరు అన్నదమ్ముల సినిమాలు ఇలా రావడం మరో విశేషం.
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
తాజావార్తలు
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
ట్రెండింగ్
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!