Site icon NTV Telugu

Mega Family: మనవరాలితో మొదటి వినాయక పూజ… అద్బుతం అంటున్న చిరు తాత

Mega Family

Mega Family

మెగా ఫ్యామిలీకి వినాయక చవితి పండగని చాలా స్పెషల్ గా మార్చింది ‘కొణిదెల క్లింకారా’. రామ్ చరణ్ ఉపాసనలకి జూన్ 20న పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా ప్రిన్సెస్‌ క్లింకారా పుట్టినప్పటి నుంచి ఉపాసన వాళ్ల ఇంట్లో ఉంది. ఇప్పుడు అపోలో ఇంటి నుంచి మెగా ఇంటికి వచ్చిన క్లింకారా, పండగ వాతావరణం తెచ్చింది. కుటుంబంతో కలిసి చరణ్, ఉపాసన వినాయక చవితి పండగ చేసుకున్నారు. మొదటి పండగ మానవరాలితో చేసుకోవడం చిరు తాతకి చాలా స్పెషల్ అనే చెప్పాలి. రామ్ చరణ్ తన హ్యాపినెస్ ని షేర్ చేసుకుంటూ… “అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను!🙏 ఈ సారి ప్రత్యేకత … చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం” అంటూ కోట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోస్ పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటోలని మెగా అభిమానులు వైరల్ చేస్తున్నారు.  

Read Also: Nayanthara : ఐకాన్ స్టార్ ట్వీట్ కు స్వీట్ రిప్లై ఇచ్చిన లేడీ సూపర్ స్టార్.. 

Exit mobile version