Mega Heros : టాలీవుడ్ లో మెగా హీరోల ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా మేనల్లుడు అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇచ్చిన సాయి దుర్గా తేజ్, వైష్ణవ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగుతున్నారు ఈ అన్నదమ్ములు. అయితే తాజాగా దీపావళి సందర్భంగా వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సంప్రదాయ బట్టల్లో తమ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా హీరోల అనుబంధం ఎలా ఉంటుందో తెలిపే ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో తమ్ముడు వైష్ణవ్ తేజ్ కు అన్న సాయి దుర్గ తేజ్ ముద్దు పెట్టాడు.
Read Also : Allu Shireesh : శిరీష్ కు కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన స్నేహారెడ్డి..
ఈ ఫోటోలు చూసిన వారంతా అన్నదమ్ములంటే ఇలాగే ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రతి దీపావళి సందర్భంగా చిరంజీవి ఇంట్లో మెగా హీరోలు అందరూ సందడి చేయడం ఆనవాయితీగా వచ్చేది. కానీ ఈసారి మాత్రం మెగా హీరోలు ఎవరి ఇంట్లో వారే వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. అటు వైష్ణవ్ తేజ్ కూడా రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ అన్నదమ్ములు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అని అడుగుతున్నారు మెగా అభిమానులు.
Read Also : Samantha : మళ్లీ దొరికిపోయిన సమంత.. రాజ్ ఇంట్లో దీపావళి వేడుకలు
