NTV Telugu Site icon

Orange To Oscars: రామ్ చరణ్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్, ఒక బాడ్ న్యూస్…

Orange To Oscars

Orange To Oscars

పాన్ వరల్డ్ ఇమేజ్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు మార్చ్ 27న ఉంది. మెగా అభిమానులు పండగలా ఫీల్ అయ్యే ఈరోజుని చాలా స్పెషల్ గా ప్లాన్ చేస్తూ భారి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ నటించిన 12 ఏళ్ల క్రితం నాటి ‘ఆరెంజ్’ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి ప్రొడ్యూసర్ నాగబాబు రెడీ అయ్యాడు. ఆరెంజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యింది కానీ ఆ తర్వాత రోజులు గడించే కొద్దీ ఆరెంజ్ సినిమాకి కల్ట్ క్లాసిక్ స్టేటస్ దొరికింది. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే సూపర్ హిట్ అయ్యేది, ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఆరెంజ్ సినిమా టాపిక్ వచ్చిన ప్రతి సారీ ట్వీట్స్ చేస్తూ ఉంటారు. అభిమానుల కోరికని నిజం చేస్తూ నాగబాబు ‘ఆరెంజ్’ సినిమాని మార్చ్ 25, 26న స్పెషల్ షోస్ కి ప్లాన్ చేశాడు. ఆరెంజ్ టు ఆస్కార్స్ అంటూ రామ్ చరణ్ సినీ ప్రస్థానానికి నీరాజనంలా ఈ స్పెషల్ షోస్ ని ప్లాన్ చేశారు. ఆరెంజ్ సినిమా స్పెషల్ షోస్ నుంచి వచ్చే ఫండ్స్ ని జనసేన పార్టీకి ఇవ్వబోతున్నట్లు నాగబాబు అనౌన్స్ చేశాడు. మెగా అభిమానులందరూ ఆరెంజ్ సినిమాని థియేటర్స్ లో చూడాలని నాగబాబు కోరాడు. ఇది నిజంగా మెగా అభిమానులకి బిగ్గెస్ట్ గిఫ్ట్ అనే చెప్పాలి.

Read Also: Bhanu Sree: బన్నీ బ్లాక్ చేశాడు అనే ట్వీట్, ఛానెల్ ప్రమోషన్ కోసమేనా?

ఇక మార్చ్ 27న మెగా అభిమానులకి ఒక బాడ్ న్యూస్ కూడా ఉంది అదేంటి అంటే చరణ్ బర్త్ డే సంధర్భంగా ఇండస్ట్రీ హిట్ అయిన ‘మగధీర’ సినిమాని రీరిలీజ్ చేస్తున్నట్లు గతంలో గీతా ఆర్ట్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. తాజాగా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా మగధీర సినిమా రీరిలీజ్ ని ఆపేస్తున్నట్లు గీత ఆర్ట్స్ ట్వీట్ ప్రకటించింది. జక్కన్న, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సెమీ పీరియాడిక్ వార్ డ్రామా మగధీర సినిమాని 4K క్వాలిటీతో చూడాలి అనుకున్న మెగా అభిమానులకి గీత ఆర్ట్స్ షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే మార్చ్ 27న చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC 15 ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ ని రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం. మరి చరణ్ తో RC 16 చేస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సన కూడా ఇలాంటి సర్ప్రైజ్ ఏమైన ప్లాన్ చేస్తాడేమో చూడాలి.

Show comments