NTV Telugu Site icon

Chiranjeevi: కొడుకు విషయంలో అలా చేసినా.. బన్నీని ఆకాశానికెత్తిన చిరు

Bunny

Bunny

Chiranjeevi: మెగాస్టార్- అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అనే ఎన్నో రోజులుగా వింటున్న పుకార్లే. అయితే ఆ పుకార్లు వచ్చినప్పుడల్లా.. చిరు, అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వడం.. పుకార్లు ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి. ఇక మరికొద్దిరోజులకే ఆ పుకార్లు మొదలవుతాయి. అందుకు కారణం అల్లు అర్జున్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. బన్నీ.. చిరు కుటుంబాన్ని పట్టించుకోడని ఒక రూమర్ ఉంది. దానివలనే ఇవన్నీ మొదలయ్యాయి అని అంటారు. అయితే ఈ మధ్యనే అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం వలన మెగా కజిన్స్ కలుసుకోవడం లేదు కానీ.. పండగలు, ఫంక్షన్స్ వచ్చినప్పుడు అందరు కలిసే ఉంటారు అని చెప్పుకొచ్చాడు. ఇక రెండు రోజుల క్రితం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే.

Sarath Babu: బ్రేకింగ్.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు

సినీ, రాజకీయ ప్రముఖులు సైతం అతనిని విష్ చేస్తూ పోస్ట్లు పెట్టారు. ఒక్క అల్లు అర్జున్ తప్ప. సరే కజిన్స్ కదా.. ఇంటిదగ్గ కలిసి ఉండొచ్చు.. ఫోన్ లో విష్ చేసి ఉండొచ్చు.. సాయంత్రం పార్టీలో కనిపిస్తాడు అని అనుకున్నారు. కానీ, పార్టీలో సైతం బన్నీ ఫ్యామిలీ కనిపించింది లేదు. దీంతో మరోసారి వీరి మధ్య గొడవలు ఉన్నాయని పుకార్లు మొదలయ్యాయి. ఇక చరణ్ బర్త్ డే నెక్స్ట్ డే నే.. తాను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తీ అయ్యిందని ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టి ఈ హీట్ ను ఇంకా రగిలించాడు బన్నీ. చరణ్ బర్త్ డే కు ఒక ట్వీట్ వేయడానికి సమయం లేదా బ్రదర్ అంటూ మెగా ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన పెద్దరికాన్ని చూపించారు. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న బన్నీపై చిరు ప్రశంసలు కురిపించారు. ” బన్నీ.. నువ్వప్పుడే 20 ఏళ్లు పూర్తిచేసుకున్నందుకు సంతోషంగా ఉంది. అప్పటి జ్ఞాపకాలు, నీ చిన్నతనం స్టిల్స్ అన్ని గుర్తొస్తున్నాయి. కాలం ఎంత వేగంగా గడిచింది. ఇన్నేళ్లలో పాన్ ఇండియా స్టార్ గా, ఐకాన్ స్టార్ గా ఎదిగిన విధానం అద్భుతం.. ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ చూసాక మెగా అభిమానులు.. మెగాస్టార్ అంటే ఇది.. కొడుకు విషయంలో అలా చేసినా పట్టించుకోకుండా బన్నీ ఎదగాలని కోరుకున్నారు.. గ్రేట్ సర్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments