NTV Telugu Site icon

Mega 157: ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ..

Chiru

Chiru

Mega 157: భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ సినిమా తరువాత ఎలాగైనా హిట్ అందుకోవాలని చిరు.. కుర్ర డైరెక్టర్లను నమ్ముకున్నాడు. అందులో భాగంగానే బింబిసార లాంటి హిట్ సినిమా ఇచ్చిన వశిష్ఠతో మెగా 157 మొదలుపెట్టాడు చిరు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే చిరు పుట్టినరోజు కానుకగా మెగా 157 కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసి బాస్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. పంచభూతాలను ఎలివేట్ చేసి చూపిస్తూ వాటితో ముడిపడిన కథగా చిరు సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. ? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Arvind Swamy: ఆ హీరో అసలు తండ్రిని నేనే.. నటుడి సంచలన వ్యాఖ్యలు

ఇక ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపాడు.. మెగా 157 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. వశిష్ట మల్లిడి, యూవీ క్రియేషన్స్ నిర్మాత, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు.. చిరు ఇంటికి వెళ్లి ఆయన ను కలిసినాట్లు తెలుస్తోంది. ఆ ఫోటోను వశిష్ఠ అభిమానులతో పంచుకుంటూ.. ” మెగా 157 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఎంతో గ్రాండ్ గా మొదలయ్యాయి. మెగా మాస్ యూనివర్స్ కోసం ఎదురుచూస్తూ ఉండండి” అంటూ చెప్పుకొచ్చాడు. చిరు చాలా కాలం తరువాత ఒక సోషియో ఫాంటసీ సినిమాను చేస్తున్నాడు. ఇక దీన్ని యూవీ నిర్మించడం విశేషం. సాహో, రాధే శ్యామ్ తరువాత యూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments