Meenakshi Chaudhary: కుర్చీని మడతపెట్టి.. ఈ ఒక్క డైలాగ్ ఉదయం నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ధం మసాలా బిర్యానీ మాస్ సాంగ్ కాగా, ఓ మై బేబీ క్లాస్ సాంగ్. ఈ రెండు పాటలు కూడా మంచి ప్రేక్షకాదరణనే సంపాదించుకున్నాయి. ఇక నేడు.. కుర్చీని మడతపెట్టి అనే మూడో సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఇదెంత ట్రోల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో మహేష్, శ్రీలీల డ్యాన్స్ అదరగొట్టేశారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. రిలీజ్ అయిన రెండు సాంగ్స్ లో శ్రీలీలనే కనిపించింది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిపారు. కానీ, ఇప్పటివరకు ఆమెతో మహేష్ సాంగ్ కానీ, కనీసం ఆమె పోస్టర్ కానీ రిలీజ్ చేయలేదు. సాంగ్స్ అన్ని శ్రీలీల తోనే ఉంటే.. మీనాక్షీ కేవలం చిన్న పాత్రకే పరిమితమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మొదట శ్రీలీల పల్స్ లో పూజా హెగ్డే ఉంది. మీనాక్షీ ప్లేస్ లో శ్రీలీల ఉంది. పూజా వెళ్లిపోవడంతో ప్లేస్ లో మారిపోయాయి. అయితే అసలు మీనాక్షీ సినిమాలో ఉందా.. ? కొంపతీసి మహేష్ కు ఏమైనా చెల్లిగా చేస్తుందా.. ? అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ మధ్యకాలంలో మీనాక్షీ సోషల్ మీడియా క్రష్ గా మారిపోయింది. ఇక గుంటూరు కారం లో మీనాక్షీ సెకండ్ హీరోయిన్ అనేసరికి మరింత హైప్ వచ్చింది. మరి ఈ చిన్నదాన్ని ఎందుకు టీమ్ ఇంకా బయటపెట్టడం లేదు.. ? లేక సర్ ప్రైజ్ గా ఉంచుతున్నారా.. ? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.
