NTV Telugu Site icon

Meenakshi Chaudhary: అమాంతం రేటు పెంచేసిన మీనాక్షి.. మహేషా మజాకా?

Meenakshi Chaudhary Cover

Meenakshi Chaudhary Cover

Meenakshi Chaudhary Hikes her Remuneration after Guntur kaaram: మీనాక్షి చౌదరి అంటే కొన్నేళ్ల క్రితం వరకు పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మహేష్ బాబు పుణ్యమా అని ఏకంగా టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. హర్యానాలోని పంచకులలో జన్మించిన మీనాక్షి ముందుగా అవుట్ ఆఫ్ లవ్ అనే సిరీస్ తో నటిగా మారింది. పెళ్లియిన వ్యక్తితో రిలేషన్ లో ఉన్న ఒక టీనేజ్ అమ్మాయిగా నటించి ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది. ఆ తరువాత ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆమె తరువాత ఖిలాడీ, హిట్ 2 సినిమాల్లో నటించింది. తమిళంలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన కోలై అనే సినిమాలో నటించగా అది తెలుగులో హత్య పేరుతో రిలీజ్ అయింది.

Vijay Antony Daughter: నీ ఆలోచనలతో చచ్చిపోతున్నా.. నువ్వు లేకుండా ఉండలేను!

అలా ఆమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అందులో హాయ్ 2 ఒక్కటి మాత్రమే హిట్ అయింది. అయితే పూజ హెగ్డే డేట్స్ కుదరక గుంటూరుకారం సినిమా నుంచి తప్పుకోవడంతో అప్పటి సెకండ్ హీరోయిన్ శ్రీలీల మెయిన్ హీరోయిన్ అవడంతో ఇప్పుడు ఆమె స్థానంలో మీనాక్షి ఎంట్రీ ఇచ్చింది. ఇక మీనాక్షి ఈ గుంటూరు కారం ఎఫెక్ట్ కి చిన్నా చితకా సినిమాల నుంచి సరాసరి పెద్ద స్టార్స్ సరసన నటించే స్థాయికి వెళ్ళింది. ఇక అందుకే ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఏకంగా కోటిన్నర డిమాండ్ చేస్తున్నట్టు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో మహేష్ బాబు హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉంటది మరి అనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఆమె రెమ్యునరేషన్ అంశం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

Show comments