సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పూజ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంటర్ అయ్యింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో హీరోయిన్ల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అయితే గుంటూరు కారం సినిమాలో ముందూ ఇద్దరు హీరోయిన్లే, ఇప్పుడూ ఇద్దరు హీరోయిన్లే… కానీ ప్రమోషన్స్ లో మాత్రం ఒకరే కనిపిస్తున్నారు. గుంటూరు కారం నుంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో మహేష్ బాబు, శ్రీలీల తప్ప మీనాకి చౌదరి కనిపించట్లేదు. ఓ మై బేబీ, కుర్చీని మడతపెట్టి సాంగ్ లో కూడా శ్రీలీలనే కనిపిస్తోంది కానీ మీనాక్షి చౌదరికి సంబంధించిన ఒక్క ప్రమోషనల్ కంటెంట్ బయటకి రాలేదు.
గుంటూరు కారం మేకర్స్ కనీసం మీనాక్షి చౌదరి పాత్రకి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. సాంగ్స్ అన్ని శ్రీలీల తోనే ఉంటే… మీనాక్షీ కేవలం చిన్న పాత్రకే పరిమితమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు మీనాక్షీ సినిమాలో ఉందా…? అనే డౌట్ తో ఉన్న ఫ్యాన్స్ ని కూల్ చేస్తూ గుంటూరు కారం నుంచి కొత్త పోస్టర్ బయటకి వచ్చేసింది. మహేష్ బాబు, మీనాక్షీ చౌదరి ఇద్దరూ ఉన్న పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. మీనాక్షి చౌదరి హాఫ్ సారీలో చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మీనాక్షీ లుక్ చూస్తుంటే పూజా హెగ్డే గుర్తొస్తుంది. సో పూజా రోల్ ని మీనాక్షి రీప్లేస్ చేస్తుందా అనేది తెలియాలి అంటే గుంటూరు కారం బయటకి వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.
Here’s introducing our @meenakshiioffl as ‘Raji’ from #GunturKaaram 🤩❤️🔥
𝟖 𝐃𝐀𝐘𝐒 to go… Worldwide Grand Release at theatres near you on JAN 12th! 🔥🔥
Super🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine… pic.twitter.com/WUC4rxR8W2
— Haarika & Hassine Creations (@haarikahassine) January 4, 2024