NTV Telugu Site icon

Meena Sagar: భర్త చనిపోయి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే రెండో పెళ్లి అంటున్నారు.. సిగ్గు లేదు.. ?

Meena

Meena

Meena Sagar: సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ గా జరుగుతున్న విషయం తెల్సిందే. ఒక స్టార్ హీరో కానీ, హీరోయిన్ కానీ.. విడాకులు ఇస్తే.. నెక్స్ట్ డే నుంచే వారు రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రేమ, పెళ్లి అనేది వారి వ్యక్తిగతం. అలాంటి పర్సనల్ విషయాలపై ఎవరైనా ఒత్తిడి తీసుకురాకూడదు అని నటి మీనా తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. నటి మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది ఆమె జీవితంలో ఎంతో విషాదం చోటుచేసుకుంది. ఆమె తన భర్త సాగర్ ను పోగొట్టుకుంది. అనారోగ్య సమస్యలతో సాగర్ కన్నుమూశాడు. ఇక భర్త మరణంతో మీనా కుంగిపోయింది. కూతురుతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఇక ఈ మధ్యనే మీనా కొత్త జీవితం మొదలుపెట్టింది. భర్త వదిలేసిన బాధ్యతలను తాను తీసుకుంది. స్ట్రాంగ్ గా నిలబడి షూటింగ్స్ చేస్తూ.. కూతురును పెంచుతుంది.

Minister Roja: బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణీని రంగంలోకి దింపారు

ఇక ఈ నేపథ్యంలోనే మీనా రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ వార్తలపై మీనా కూతురు ఒక ఈవెంట్ లో ఎమోషనల్ అయ్యింది. నా తల్లి కూడా మనిషే.. ఇలాంటి మాటలు, పుకార్లు రావడం వలన ఆమె ఎంత బాధపడుతుందో మీకు తెలుసా అంటూ కంటనీరు పెట్టింది. దీంతో అప్పటినుంచి ఆమె పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇక తాజాగా మీనా స్నేహితురాలు డ్యాన్స్ మాస్టర్ కాలా కూడా ఆమె పెళ్లి వార్తలపై స్పందించింది. ” నేను, మీనా మంచి స్నేహితులం మాత్రమే కాదు.. అక్కాచెల్లెళ్లు లా ఉంటాం. సాగర్ చనిపోయే రోజులో కూడా నేను ఆమెతోనే ఉన్నాను. ఆయన చనిపోయాకా .. మీనా షూటింగ్స్ కు వెళ్ళేటప్పుడు నేను కూడా తోడు వెళ్లేదాన్ని. మీనాది ఇంకా చిన్న వయస్సు.. ఇలా ఎన్నేళ్లు ఒంటరిగా ఉంటుంది. రెండో పెళ్లి చేసుకోమని ఆమెకు సలహా ఇచ్చాను. కానీ, ఆమె దానికి ఒప్పుకోలేదు. ఇలాంటి విషయాలు నీకు అనవసరం.. నా పెళ్లి గురించి మాట్లాడే లెక్క అయితే.. ఇక నాతో మాట్లాడకు అని కోప్పడింది. నాకు కూతురు ఉంది..తన బాధ్యత నాది. తనను చూసుకుంటూ ఉండిపోతాను అని చెప్పింది” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు.. భర్త చనిపోయి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే రెండో పెళ్లి అంటున్నారు.. మీకు సిగ్గు లేదు.. ? అని కొందరు.. ఆమె పెళ్లి ఆమె ఇష్టం.. మీకెందుకు అని చెప్పుకొస్తున్నారు.

Show comments