Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News May 1st Releases Tollywood Small Films Vs Silent Dubbing Movies

May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్

Published Date :April 30, 2026 , 10:13 am
By subbarao kilari
May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ వంటి చిత్రంతో పలకరించిన తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయి మాసివ్ హిట్ మళ్లీ కనిపించలేదు. గత మూడు నెలలుగా చిన్న సినిమాలే ఇక్కడ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ రేసు నుండి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో లో- బడ్జెట్ చిత్రాలకు ఇది వరప్రసాదంగా మారింది. ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేందుకు చిన్న సినిమాల మేకర్స్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా కంటెంట్ కంటే కూడా ప్రమోషనల్ వీడియోలు వెరైటీ కాన్సెప్ట్‌లతో జనాలను ఆకర్షించేందుకు చిత్ర యూనిట్లు శ్రమిస్తున్నాయి. మే 1న విడుదలవుతున్న ‘జెట్లీ’, ‘గాయపడ్డ సింహం’ వంటి సినిమాల ప్రమోషన్లు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

డబ్బింగ్ సినిమాల చడీచప్పుడు లేని రాక ఒకవైపు తెలుగు స్ట్రైట్ సినిమాలు ప్రమోషన్ల కోసం నానా అవస్థలు పడుతుంటే భారీ అంచనాలతో వస్తున్న డబ్బింగ్ సినిమాలు మాత్రం తెలుగు ప్రచారాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ‘ఏక్ దిన్’ను తెలుగులో ‘ఒక రోజు’ పేరుతో విడుదల చేస్తున్నారు. సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇక్కడ భారీ ప్రమోషన్లు ఆశించినప్పటికీ మూవీ టీం మాత్రం హిందీలో ఒక ఈవెంట్‌తో సరిపెట్టేసింది. కనీసం ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా నిర్వహించకపోవడం గమనార్హం.

Also Read

  • Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
  • Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
  • Peddi: 'టాక్సిక్' అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ 'పెద్ది'!
  • Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!

నార్త్ నుండి సౌత్ వరకు అంతా సైలెంట్ రితేష్ దేశ్‌ముఖ్ జెనీలియా జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రాజా శివాజీ’ని కూడా తెలుగులో విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ దీని హడావుడి కేవలం నార్త్ బెల్ట్‌కే పరిమితమైంది. ఇక మాలీవుడ్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘పేట్రియాట్’ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి దిగ్గజ నటులు ఉన్నప్పటికీ తెలుగు వెర్షన్ రిలీజ్ విషయంలో క్లారిటీ కరువైంది. మే 1న ఈ సినిమా ఇక్కడ వస్తుందో లేదో అన్నట్లుగా ప్రమోషన్ల ఊసే లేదు.

నమ్మకమా, నిర్లక్ష్యమా పేరుకు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పడం అన్ని భాషల్లో విడుదల చేస్తున్నామని ప్రకటించడం వరకే మేకర్స్ పరిమితమౌతున్నారు. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఎలాగూ చూస్తారులే అనే ధీమానో లేక ప్రమోషన్ ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనో కానీ ఈ డబ్బింగ్ సినిమాలు మాత్రం ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నాయి. మరి మే 1న రాబోతున్న ఈ సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dubbing Movies Promotions
  • Gayapadda Simham
  • Jaitley Movie
  • May 1st Movie Releases
  • Patriot Movie Telugu

తాజావార్తలు

  • May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్

  • 5G Smart Phones Under 15000: 7,000 mAh బ్యాటరీ.. హైటెక్ ఫీచర్లతో, 15,000 బడ్జెట్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

  • Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్‌షీట్‌ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది…!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!

ట్రెండింగ్‌

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions