Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో జరిగిన ‘ఎపిక్’ టీజర్ ఆవిష్కరణ వేడుకలో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఎపిక్ టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎపిక్ సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆదిత్య హాసన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది. ఎందుకంటే నేనూ విదేశాల్లో చదువుకున్నాను. ఇందులోని చాలా సన్నివేశాలు నాకు కనెక్ట్ అయ్యాయి. విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళకు మాత్రమే కాదు.. ఈ కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయి. కుటుంబం, ప్రేమ, బంధం, భావోద్వేగాలు ఇలా ప్రతిదీ మీ మనసుకు నచ్చుతాయి.
దర్శకుడు ఆదిత్య హాసన్ లో ఎంతో ప్రతిభ ఉంది. భవిష్యత్తులో ఆదిత్యను స్ఫూర్తిగా తీసుకొని ఎందరో కొత్త దర్శకులు వస్తారు. వైష్ణవి చైతన్య లాంటి ప్రతిభగల నటితో నటించడం సంతోషంగా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి సంస్థలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సార్, లక్కీ భాస్కర్, టిల్లు, మ్యాడ్, జెర్సీ లాంటి సినిమాల సరసన ఎపిక్ చేరుతుందనే నమ్మకం ఉంది. మన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది మన కథే కదా అనిపిస్తుంది. ఇందులో హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం మనసు పెట్టి పనిచేశారు.” అన్నారు.
Also Read
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
తాజావార్తలు
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!