మాస్ మహరాజ్ రవితేజ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర రావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అదిరిపోయింది. ఇందులో రవితేజ స్టువర్టుపురం గజ దొంగగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా రవితేజ కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా రాబోతోంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చినట్టు తెలుస్తోంది. రెండు పాటలు మినహాయిస్తే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందట.
త్వరలోనే సాంగ్స్ షూట్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో జూలై ఫస్ట్ వీక్‌లో టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. జూలై 7 లేదా 8వ తేదిన టీజర్ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. దాంతో మాస్ రాజా ఫ్యాన్స్ మాస్ జాతరకు రెడీ అయిపోతున్నారు. గతేడాది రవితేజ నుంచి ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలు రాగా.. ధమాకా ఒక్కట్టే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కానీ ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే చివరగా వచ్చిన రావణసుర మాత్రం డిసప్పాయింట్ చేసింది. అందుకే టైగర్ నాగేశ్వరరావుతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. మరి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.