Site icon NTV Telugu

RT77 : రవితేజ – శివనిర్వాణ – మైత్రి మూవీస్.. టైటిల్ “ఇరుముడి”

Rt77

Rt77

నిన్నుకోరి, మజిలి వంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ ఖుషి ప్లాప్ తో కాస్త స్లో అయ్యాడు. కాస్త లాంగ్ గ్యాప్ తీసుకుని మరొక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజ రవితేజ హీరోగా సినిమా చేయబోతున్నాడు. కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. థ్రిలర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మింస్తోంది. కొద్దీ సేపటి క్రితం ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు.

Also Read : Akira Nandan : హై కోర్టుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్..

అయితే ఈ సినిమాకు సెన్సిటివ్ టైటిల్ ఫిక్స్ చేసారు.  కూతుర్ని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి పడే తాపత్రయం నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే పేరు ఫిక్స్ చేశారు. కథకు తగ్గట్టుగా ఇరుముడి టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందట. రిపబ్లిక్ డే కానుకగా సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సినిమా టైటిల్ ను అదికారకంగా ప్రకటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. టక్ జగదీష్, ఖుషి ప్లాప్స్ తో వెనకబడ్డాడు.   రవితేజ కూడా వరుస ప్లాప్స్ నుండి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు. కానీ అది రవితేజ రేంజ్ హిట్ కాదు.  ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న ఇరుముడి అటు శివ నిర్వాణకు ఇటు మాస్ మహారాజకు చాల కీలకం.  ఇద్దరు భారీ కమర్షియల్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Exit mobile version