Ravi Teja – Harish Shankar: రవితేజ, హరీష్ శంకర్ సినిమా మొదలు.. కానీ బ్యానర్ మారింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mass Maharaja Ravi Teja – Harish Shankar’s Film Announced: మ్యాజికల్ కాంబో మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించనున్న ఎంటర్‌టైనర్ కోసం మరోసారి చేతులు కలిపారు. వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకి సహ నిర్మాత. హరీష్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అయితే, రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ ఇచ్చింది కూడా హరీష్ రావే. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దీంతో ఈ మాస్, క్రేజీ కాంబినేషన్‌లో చిత్రం ధమకేధార్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధమయ్యారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్.
Actor Ravindra Berde: ‘సింగం’ నటుడు కన్నుమూత
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
హరీష్ శంకర్ తన హీరోలను మ్యాసియస్ట్ అవతార్ లో చూపించడంలో దిట్ట అని పేరుంది. రవితేజతో హరీష్ చేసిన షాక్ సినిమా సంగతి పక్కన పెడితే గత చిత్రం ’మిరపకాయ్’ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు, మాసెస్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఏ సినిమా ఎలాంటి మాస్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుందో తెలియజేయడానికి ..‘ఈసారి మాస్ రీయూనియన్ స్పైసీగా ఉంటుంది’ అని మేకర్స్ అనౌన్స్ చేశారు. హై ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కోసం హరీష్ శంకర్ ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయనున్నారని, మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారని వెల్లడించారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!