Raviteja: అతని గురించి ఇప్పుడు మాట్లాడను.. బాలయ్య కూడా హిట్ కొట్టాలి
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక అగర్వాల్ నిర్మిస్తున్నాడు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వంశీ. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రేణు దేశాయ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
Sai Dharam Tej: అన్ని మామ పోలికలే.. ఎంతైనా మెగా ఫ్యామిలీ కదా
Also Read
- Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్‌డేట్... 'పెద్ది' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
- Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
- Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
- Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్ అప్పుడేనా?
ఇక ఈ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ.. ” ముందు సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. అందరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా రామ్ లక్ష్మణ్.. ఆ ట్రైన్ సీన్స్ కోసం ఎంతో కష్టపడ్డారు. వారికి అంత బాగా ఎందుకు వచ్చింది అంటే.. వారు కూడా చీరాలకు చెందినవారే.. నాక్కూడా ఈ కథ గురించి కొంత తెలుసు కానీ, డైరెక్టర్ రీసెర్చ్ చేసి చెప్పడంతో మరింత తెలుసుకున్నా. ఇక ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న రేణు దేశాయ్ కు థాంక్స్.. ఆ క్యారెక్టర్ లో ఆవిడ ఎంత బాగా సెట్ అయ్యిందో అంటే.. అస్సలు నమ్మలేరు. ఇక మా నిర్మాత అభిషేక్ అగర్వాల్. మనిషి ఎంత భారీగా ఉంటాడో.. ఈ సినిమా కూడా అంత భారీగా ఉంటుంది. థాంక్యూ అభిషేక్.. మీతో ఇంకా ఇంకా సినిమాలు చేయాలనుకుంటున్నాను. మా అందమైన హీరోయిన్లు చాలా బాగా చేశారు. ఇక డైరెక్టర్ గురించి ఇప్పుడు మాట్లాడడం కంటే.. సక్సెస్ అయ్యాకా మాట్లాడితే బావుంటుంది అని అనుకుంటున్నాను. ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో అల్ ఎమోషన్స్ ఉన్నాయి. థ్రిల్ల్ ఫీల్ అవుతారు. కచ్చితంగా థియేటర్ లో చూడండి. ఇక నా సినిమాతో పాటు.. నాకెంతో ఇష్టమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మన బాలయ్య సినిమా భగవంత్ కేసరి కూడా రిలీజ్ అవుతుంది.. రెండు సినిమాలు హిట్ అందుకోవాలని కోరుకుంటున్నాను.. ఈ రెండింటితో పాటు విజయ్ లేవు కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా విజయం అందుకోవాలని ఆశిస్తున్నాను .. థాంక్యూ.. జై సినిమా” అని ముగించాడు.
తాజావార్తలు
-
IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్‌మీ C100x భారత్‌లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్‌ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్‌డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
-
Cole Thomas Allen: సాఫ్ట్‌వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!