మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటివలే దాస్ కా ధమ్కీ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అన్ని సెంటర్స్ లో ప్రాఫిట్స్ రాబట్టిన ఈ మూవీ ఇచ్చిన జోష్ లో విశ్వక్ సేన్ తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేసేసాడు. రౌడీ ఫెల్లో, చల్ మోహన రంగ సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ భారి బడ్జట్ తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది అనే వార్త వైరల్ అయ్యింది. అదేంటి ఇప్పుడు విశ్వక్ సేన్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాజెక్ట్ ఏముందా అని ఆలోచిస్తున్నారు. అయితే విశ్వక్ సేన్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా విద్యాధర్ అనే యంగ్ డైరెక్టర్ ‘గామీ’ అనే సినిమా చేస్తున్నాడు. కాన్సెప్ట్ విజువల్ తోనే గామీ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్ స్టేజ్ కి చేరుకోవడంతో యువీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసింది. దాదాపు రెండేళ్లుగా డిలే అవుతూ వచ్చిన గామీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది అంటే చాందిని చౌదరి ట్వీట్ చేసింది. దీంతో గామీ సినిమా పేరు మళ్లీ వినిపించడం మొదలయ్యింది.
కొంతమంది మాత్రం విశ్వక్ సేన్ ఈ సినిమాని పట్టించుకావట్లేదు అందుకే అసలు ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క మాట కూడా చెప్పట్లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇవి జస్ట్ రూమర్స్ మాత్రమే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే యువీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్ లో సినిమాని విశ్వక్ సేన్ వదులుకునే అవకాశం లేదు, పైగా ఆ బ్యానర్ కి ప్రభాస్ అండ్ ప్రభాస్ ఫాన్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి విశ్వక్ గామీ సినిమాని మిస్ అయ్యే అవకాశమే లేదు. ఎంతో ప్యాషన్ తో ప్రొడ్యూస్ కూడా లేని సమయం నుంచి విశ్వక్ సేన్ అండ్ చాందిని చౌదరి గామీ సినిమాతో ట్రావెల్ అవుతున్నారు. మరి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకోని ఎప్పుడు ఆడియన్స్ ముందుకి వస్తుందో చూడాలి.
Gaami is finally a wrap! Can’t wait for the world to witness this fantastic film we made 🔥 pic.twitter.com/a9v7E6SytL
— Chandini Chowdary (@iChandiniC) May 1, 2023
