Site icon NTV Telugu

Mass Jathara : మాస్ జాతర టీజర్ అప్డేట్.. డేట్, టైమ్ ఫిక్స్

Mass Jathara

Mass Jathara

Mass Jathara : మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తున్న మూవీ మాస్ జాతర. భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రాఖీ పండుగ సందర్భంగా సాలీడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ టీజర్ ను ఆగస్టు 11న ఉదయం 11 గంటల ఎనిమిది నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మూవీని కూడా యాక్షన్ కమ్ ఎంటర్ టైన్ మెంట్ కేటగిరీలోనే తీసుకొస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన పాటలు మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఈ మూవీలో ఎలాగైనా మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని హీరో రవితేజ చూస్తున్నాడు.

Read Also : ’పెద్ది’ కోసం కీలక వ్యక్తిని తీసుకొచ్చిన రామ్ చరణ్‌

సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్స్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి టీజర్ డేట్ అండ్ టైమ్ ను అనౌన్స్ చేశారు. ఇందులో రవితేజ మాస్ లుక్ లో మెరుస్తున్నాడు. కళ్లజోడు, స్టైలిష్ లుక్ బాగుంది. రవితేజ హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతోంది. ఈ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీజర్ తో అంచనాలు పెంచితే మూవీకి మంచి బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది.

Read Also : Mahesh Babu : సౌత్ లో ఏకైక హీరోగా మహేశ్ బాబు రికార్డ్.. ఎందులో అంటే..?

Exit mobile version