Site icon NTV Telugu

Bigg Boss 9 : మరీ ఓవర్ చేసిన మాస్క్ మ్యాన్ హరీష్.. ఇంత అవసరమా..?

Harish

Harish

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 నేడు స్టార్ట్ అయిపోయింది. ఇందులోకి కామన్ మ్యాన్ లిస్టులో మాస్క్ మ్యాన్ హరీష్ ఎంట్రీ ఇచ్చాడు. అగ్ని పరీక్ష సమయంలోనే చాలా రఫ్ గా మాట్లాడి అందరికీ చిరాకు తెప్పించాడు. కానీ బిగ్ బాస్ కోసం ఆలోచించకుండా గుండు గీయించుకుని మరీ సెలెక్ట్ అయ్యాడు. ఇక ఎంట్రీ ఇస్తూనే నాగార్జున వద్ద కాస్త ఓవర్ గానే మాట్లాడాడు. నా భార్య నాలో సగం.. ఆమె లేకుండా నేనుండలేను లాంటి డైలాగులు కొట్టాడు. సరేలే నాగార్జున కాబట్టి అతని ఓవర్ ను తట్టుకుని లోపలికి పంపించాడు.

Read Also : Thanuja Puttaswamy : నాన్న మూడేళ్లు మాట్లాడలేదు.. చేదు ఘటన చెప్పిన తనూజ

ఇక హౌస్ లోకి వెళ్లగానే.. ఫ్లోర్ కు మొక్కాడు. దేవాలయంలోకి ఎంట్రీ ఇచ్చిన రేంజ్ లో దండాలు పెట్టాడు. అక్కడికేదో బిగ్ బాస్ షో అంటే పరమ పవిత్రమైన ప్లేస్ అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఇది చూసే వారికి మరీ ఓవర్ గా అనిపించింది. అసలే బిగ్ బాస్ షో మీద నెగెటివిటీ ఎక్కువ అవుతోంది. ఇలాంటి టైమ్ లో ఇంత ఓవర్ చేసి బిగ్ బాస్ పరువు తీయడం అవసరమా అంటున్నారు బిగ్ బాస్ ప్రేమికులు. ఇక కంటెస్టెంట్లతోనూ కాస్త గంభీరంగానే మాట్లాడాడు. హౌస్ క్లీనింగ్ పనిని ఇమ్మాన్యుయెల్ లేదా శ్రష్టి వర్మకు ఇవ్వాల్సిందిగా చెప్పగా.. ఏ మాత్రం ఆలోచించకుండా ఇమ్మాన్యుయెల్ కు ఇచ్చాడు హరీష్. ఇలా వచ్చీ రాగానే తన ప్రవర్తనతో కాస్త ఓవర్ గానే చేస్తున్నాడు. మరి ముందు ముందు ఎలా ఉంటాడో చూడాలి.

Read Also : Shivani nagaram : శివానీ నగరం వరుస హిట్లు.. ఎవరీ బ్యూటీ..?

Exit mobile version