NTV Telugu Site icon

Mark Antony: మార్క్ ఆంటోనీ హిట్.. డైరెక్టర్ కు లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

Adhik

Adhik

Mark Antony: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, రీతూ వర్మ జంటగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మార్క్ ఆంటోనీ. ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై వినోద్ కుమార్ నిర్మించాడు. గతే నెల 15 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకొని విశాల్ కు గట్టి కమ్ బ్యాక్ వచ్చేలా చేసింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ఓటిటీలో కూడా దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఎప్పటినుంచో.. సినిమా హిట్ అయితే డైరెక్టర్ కు లగ్జరీ కారులను గిఫ్ట్ ఇవ్వడం ట్రెండ్ గా వస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కు నిర్మాత వినోద్ కుమార్ ఒక లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లగ్జరీ BMW కారును గిఫ్ట్ గా ఇచ్చిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు.

Raashi Khanna: ఆ హీరో పక్కన అప్పుడు సెకండే.. ఇప్పుడు కూడా సెకండేనా పాప.. ?

ఇక ఈ కారు గిఫ్ట్ గా ఇవ్వడంతో డైరెక్టర్ ఫుల్ ఖుష్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అధిక్ గురించి చెప్పాలంటే త్రిష ఇల్లనా నయనతార అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత శింబుతో ఒక సినిమా చేశాడు. ఇవేమి అతనికి మంచి హిట్ ను ఇవ్వలేకపోయాయి. ఇక మార్క్ ఆంటోనీ పై గట్టి నమ్మకంతోనే విశాల్ .. ఈ సినిమాను ఒప్పుకున్నాడు. దీంతో విశాల్ కు గట్టి కమ్ బ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ గా అధిక్ రికార్డ్ కొట్టేశాడు. ప్రస్తుతం ఈ సినిమా తరువాత స్టార్ హీరోలకు కథలను వినిపించే పనిలో ఉన్నాడట అధిక్. మరి తన తరువాత సినిమా ఏ స్టార్ తో ఉంటుందో చూడాలి.