Maremmma Pre Release Event: అబ్బాయి సినిమా చూసి ఫిదా అయిన రవితేజ.. ‘మారెమ్మ’పై మాస్ మహారాజా ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maremmma Pre Release Event: ఒక హీరో తొలి సినిమా అంటే సాధారణంగా యాక్షన్, లవ్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో భారీగా లాంచ్ చేయాలని చూస్తారు. కానీ రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ మాత్రం అందుకు పూర్తి భిన్నమైన కథను ఎంచుకున్నాడు. ఒక మనిషికి, ఒక దున్నపోతుకు మధ్య ఏర్పడే అనుబంధాన్ని కేంద్రంగా చేసుకుని తెరకెక్కిన ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రానుండగా, తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే ట్రైలర్ కూడా గ్రామీణ వాతావరణం, యాక్షన్, ఎమోషన్స్ తో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
నిన్న జరిగిన ‘మారెమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రవితేజ హాజరు కావడంతో కనుల పండుగలా కనిపించింది అక్కడి వాతావరణం . మాధవ్ కూడా చిన్నప్పటి నుంచి రవితేజను, ఆయన సినిమాలను చూస్తూ పెరిగానని, తన మొదటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తను రావడం ఎంతో ప్రత్యేకమైన విషయమని చెప్పాడు. రవితేజతో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని, ఆయన తనకు అన్నయ్యలాంటి వ్యక్తి అని మాధవ్ చెప్పుకొచ్చారు.
Also Read
- Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
అయితే మాధవ్ సినిమాకు రవితేజ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ‘మారెమ్మ’ పై అంచనాలు పెంచుతున్నాయి. ‘మారెమ్మ’ రఫ్ కట్‌ను ఇప్పటికే చూసిన రవితేజ, సినిమా చాలా రూటెడ్‌గా, రస్టిక్‌గా ఉందని ప్రశంసించారు. కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా గ్రామీణ వాతావరణంతో సాగే ఈ సినిమా తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఆడియన్స్‌కు కూడా సినిమా తప్పకుండా నచ్చుతుందని, మాధవ్ బాగా నటించాడని రవితేజ పేర్కొన్నారు. ఈ సినిమాకు మంచి పేరు రావడంతో పాటు నిర్మాతలకు మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.
‘మారెమ్మ’ కథలో అసలు ప్రత్యేకత ఏమిటంటే మనిషికి, దున్నపోతుకు మధ్య ఉండే అనుబంధం. చిన్నప్పటి నుంచి హీరోకు ఆ జంతువుతో ఏర్పడే బంధం క్రమంగా కథకు భావోద్వేగంగా మారుతుంది. ఈ బంధాన్ని తెలంగాణలోని పల్లెటూరి జీవితం, గ్రామదేవత మారెమ్మతల్లి నేపథ్యంతో ముడిపెట్టి దర్శకుడు మంచాల నాగరాజు కథను రూపొందించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. మాధవ్ హీరోగా మాత్రమే కాకుండా ఈ పాత్ర కోసం తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చుకున్నాడు. అతని రస్టిక్ లుక్ పాత్రకు సరిపోయేలా ఉందని రవితేజ ప్రశంసించారు.
హీరోయిన్ దీపా బాలు నటనను కూడా రవితేజ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆమె తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలంగాణ యాసను నేర్చుకుని మాట్లాడటంతో పాటు పాత్రలో బాగా నటించిందని అభినందించారు. నటుడు వికాస్ వశిష్ట పనితీరు కూడా తనకు నచ్చిందని చెప్పారు. కొత్త దర్శకుడు మంచాల నాగరాజు తొలి సినిమాకే ఇలాంటి భిన్నమైన కథను ఎంచుకుని తెరకెక్కించిన విధానాన్ని కూడా రవితేజ మెచ్చుకున్నారు.
టెక్నికల్ గా కూడా ‘మారెమ్మ’కు మంచి బృందం పనిచేసినట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి అందించిన పాటలు తనకు నచ్చాయని రవితేజ చెప్పారు. సినిమాటోగ్రఫీ కూడా బాగుందని ప్రశంసించారు. సినిమా క్లైమాక్స్ తనకు చాలా నచ్చిందని, రవితేజ సినిమా చూసి ఎమోషనల్ అయ్యారని మాధవ్ స్వయంగా వెల్లడించాడు. దర్శకుడు కూడా చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించేలా ఉంటాయని చెబుతున్నారు.
మయూర్ రెడ్డి బండారు మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. దీపా బాలు హీరోయిన్గా నటించగా, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రవితేజకు నచ్చిన ఈ రూటెడ్ అండ్ రస్టిక్ కథ ప్రేక్షకులకు కూడా అదే స్థాయిలో కనెక్ట్ అవుతుందా, మాధవ్ తొలి సినిమాతో హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటాడా అన్నది సెప్టెంబర్ 10న తేలనుంది.
తాజావార్తలు
-
Maremmma Pre Release Event: అబ్బాయి సినిమా చూసి ఫిదా అయిన రవితేజ.. ‘మారెమ్మ’పై మాస్ మహారాజా ప్రశంసలు
-
Miss World 2026 Winner: జోహెయిర్రీ మోలా సొంతం చేసుకున్న మిస్ వరల్డ్ కిరీటం.. టాప్ 40లో నికితా పొర్వాల్
-
Bigg Boss Telugu 10: ఇక బిగ్ బాస్ సందడే.. ఈరోజు నుంచి షో స్టార్ట్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే!
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!