ప్రపంచ మాజీ సుందరి, ప్రముఖ నటి మానుషి చిల్లర్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌పై హాట్ కామెంట్స్ చేసింది. తనకు రామ్‌చరణ్ అంటే క్రష్ అని.. అతగితే డేట్‌కు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా చూశాక రామ్‌చరణ్‌కు తాను పెద్ద ఫ్యాన్ అయిపోయానని మానుషి చిల్లర్ చెప్పింది. ప్రస్తుతం మానుషి చిల్లర్ ఓ బాలీవుడ్ సినిమాలో నటించింది. అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్విరాజ్’ చిత్రంలో మానుషి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా ఇస్తున్న ఓ ఇంటర్వ్యూలో మీకు ఏ హీరో ఇష్టం అని యాంకర్ అడగ్గా.. మానుషి పై విధంగా స్పందించింది.
Bigg Boss: అక్కినేని ఫ్యామిలీపై కోపం.. మామ పోస్ట్ కే ఎసరు పెట్టిన సమంత..?
అయితే రామ్‌చరణ్‌కు పెళ్లి అయిపోయింది కదా అని యాంకర్ చెప్పడంతో.. పెళ్లి కాకపోయి ఉంటే డేట్‌కి వెళ్దామా అని చరణ్‌ను తానే స్వయంగా అడిగేదాన్ని అంటూ మానుషి చిల్లర్ వయ్యారాలు ఒలకపోసింది. డేటింగ్‌లో చెర్రీతో కలిసి ఏం చేస్తారని అడగ్గా.. కలిసి సినిమాలు చూస్తాం, ఇష్టమైన ఫుడ్ తింటాం, ఇంకా ఎన్నెన్నో వియాలను మాట్లాడుకుంటాం అంటూ చెప్పుకొచ్చింది. కాగా బాలీవుడ్ మూవీ ‘పృథ్విరాజ్’లో అక్షయ్ కుమార్ భార్య పాత్రలో మానుషి చిల్లర్ కనిపించనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, అశుతోష్ రాణా, సోనూ సూద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
