Mansoor Ali Khan to file a Criminal Defamation cases on Trisha Khushboo Chiranjeevi: స్టార్ హీరోయిన్ త్రిష మీద నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన మన్సూర్ అలీఖాన్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్రిషతో తనకు బెడ్ రూమ్ సీన్ ఉంటుందని ఊహించానని గతంలో అనేక మంది హీరోయిన్స్ ని రేప్ చేసినట్టు త్రిషతో కూడా ఒక రేప్ సీన్ పెడతారేమో అనుకున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలు రకరకాలుగా బయటకు వెళ్లాయి, ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ త్రిష తన సోషల్ మీడియా వేదికగా మన్సూర్ అలీ ఖాన్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. మహిళలను కించపరిచే విధంగా మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడాడని ఇప్పటివరకు అతనితో నటించకపోవడం తన అదృష్టం, ఇకమీదట తాను అతనితో నటించకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను అంటూ రాసుకొచ్చింది. ఇక ఆ తర్వాత అనేకమంది త్రిషకు మద్దతుగా మాట్లాడారు.
PM Modi: “విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం అవసరమా.?” మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ..
సోషల్ మీడియాలో మనుషుల అలీ ఖాన్ మీద విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఖుష్బూ, చిరంజీవి అయితే మరింత ఘాటుగా మాట్లాడారు. అయితే ఈ విషయంలో తానేమీ తప్పు మాట్లాడలేదని మన్సూర్ అలీ ఖాన్ ముందు నుంచి చెబుతూనే వచ్చారు. అయితే తమిళ నడిగర్ సంఘం మొదలు అనేకమంది మన్సూర్ అలీ ఖాన్ మీద తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్న నేపథ్యంలో తన తప్పు లేదని అంటూనే త్రిష బాధ పడింది కాబట్టి క్షమించాలని క్షమాపణలు చెప్పారు. ఇక తాజాగా ఈ కేసులో త్రిష, నటి కుష్బూ, మెగాస్టార్ చిరంజీవి మీద పరువు నష్టం పరిహారం, క్రిమినల్, సివిల్ దావా సహా ప్రజాశాంతికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడారని సెక్షన్ల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు మన్సూర్ అలీ ఖాన్ ప్రకటించారు. తన లాయర్ ద్వారా రేపు కోర్టులో వీరి మీద కేసు నమోదు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్లబోతుంది అనేది కాలమే నిర్ణయించాలి.