Mansoor Ali Khan: త్రిషకు నేను సారీ చెప్పానా .. పెద్ద జోక్.. ప్లేట్ తిప్పిన మన్సూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mansoor Ali Khan: కోలీవుడ్ లో సినిమాల కంటే వివాదాలే ఎక్కువ నడుస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్నిరోజుల నుంచి నటుడు మన్సూర్ ఆలీఖాన్ గురించే సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ సృష్టించిన మన్సూర్.. తగ్గేదేలే అంటూ.. ఇంకా ఇంకా ఆ వివాదానికి ఆజ్యం పోస్తూనే ఉన్నాడు. నిన్నటికి నిన్న మీడియా ముందు త్రిష, ఖుష్బూ, చిరంజీవి మీద పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చిన మన్సూర్.. ఇప్పుడు అస్సలు త్రిషకు సారీనే చెప్పలేదని ప్లేట్ మార్చదు. కొన్ని రోజుల క్రితం మన్సూర్ సారీ చెప్పినట్లు ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చిన విషయం తెల్సిందే. అందులో.. “నేను కత్తి లేకుండా.. ఒక వారం పాటు యుద్దం చేశాను. ఈ యుద్ధంలో రక్తపాతం లేకుండానే నేను గెలిచాను.. ఏదిఏమైనా కూడా నా మాటలతో త్రిష మనసు బాధపెట్టినందుకు క్షమాపణ చెబుతున్నా.. ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసిందనుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ఇక మన్సూర్ క్షమాపణను మంచి మనసుతో త్రిష కూడా స్వీకరించినట్లు ట్వీట్ చేసింది.
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ఇక్కడితో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడింది అనుకున్నారు. కానీ, మన్సూర్ కొత్త వివాదానికి తెరలేపాడు. త్రిషకు తాను సారీ చెప్పలేదని ప్లేట్ తిప్పాడు. ” నేను నా మేనేజర్ తో మాట్లాడినప్పుడు.. త్రిషకు క్షమాపణలు అనే మాట రాలేదని, అతను తప్పుగా అనుకోని క్షమాపణలు కోరినట్లు రాసుకోచ్చాడని చెప్పుకొచ్చాడు.. నేను త్రిషకు సారీ చెప్పడం ఏంటీ .. పెద్ద జోక్ ఇది అని కొట్టిపారేస్తూ నవ్వుకొచ్చాడు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. మన్సూర్ మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని కొంతమంది చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!