Site icon NTV Telugu

Mannara Chopra:స్టేజిపై డైరెక్టర్ ముద్దు.. అందులో తప్పేముంది.. వాళ్లకు పనిలేక

Mannar

Mannar

Mannara Chopra: నటి మన్నార్ చోప్రా గురించి తెలుగువారికి అంతగా పరిచయం లేదు. ఒకటి రెండు సినిమాల్లో తప్ప ఆమె ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు. కానీ, కొన్ని రోజుల క్రితం ముద్దు వివాదంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తిరగబడరాసామీ అనే సినిమా ఈవెంట్ లో దర్శకుడు ఎస్. రవికుమార్.. స్టేజిపైనే ఆమెను ముద్దాడి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఒక నటిని బలవంతంగా ఒక డైరెక్టర్ అలా ముద్దుపెట్టుకోవడం ఏంటి అని అందరు ఆగ్రహించారు. ఇక దానికి రవికుమార్ వివరణ కూడా ఇచ్చాడు. తాజాగా మన్నార్ చోప్రా మరోసారి ఈ వివాదంపై స్పందించింది. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈ భామ హిందీ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. సల్మాన్ ఖాన్ ఆమెను సాదరంగా ఆహ్వానించాడు. పుష్ప సినిమాలోని సామీ సామీ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ససల్మాన్ కు ఠంక్ చెప్పిన మన్నార్.. ముద్దు వివాదం గురించి మాట్లాడింది.

Foot Ball: 2023లో అత్యధిక పారితోషికం పొందిన ఫుట్‌బాల్ ఆటగాళ్ళు వీళ్లే..

” ఎస్. రవి కుమార్, నేను కలిసి చాలా ఏళ్ళు అవుతుంది.. అందుకే చూడగనే అలా పలరించారు. అది మీరనుకునే ముద్దు కాదు. ప్రేమపూర్వకంగా ఆయన నాకు పెక్ తరహా ముద్దు పెట్టారు. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు. అందులో తప్పేమి నాకు కనిపించలేదు. అయితే జనాలు.. పని ఏం లేక.. ఇలాంటివాటిని తప్పు అని చెప్పుకొస్తున్నారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ భామ బిగ్ బాస్ లో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

Exit mobile version