Manmadhudu Re Release Trailer: అక్కినేని నాగార్జున కెరీర్ లో టాప్ 10 మూవీస్ తీస్తే మన్మథుడు అందులో ఖచ్చితంగా ఉంటుంది. నాగ్ ను.. మన్మథుడుగా మార్చిన సినిమా అంటే ఇదే. కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జుననే నిర్మించాడు. ఈ చిత్రంలో నాగ్ సరసన సోనాలి బింద్రే, అన్షు నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుంచి జాలువారిన కథ మన్మథుడు. ప్రస్తుతం ఈ సినిమా రీరిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెల్సిందే. అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆగస్టు 29 న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ను 4k లో రిలీజ్ చేశారు. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని సినిమాలో మన్మథుడు ఒకటి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాగార్జున నటన, హీరోయిన్ల అందం, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్రహ్మానందం, సునీల కామెడీ అన్ని ఒక ఎత్తు అయితే త్రివిక్రమ్ డైలాగ్స్ మరో ఎత్తు అని చెప్పాలి.
Rakul Preet Singh: అవకాశాలు లేకపోయినా.. అన్ని కోట్లు పెట్టి కారు కొన్నదా.. ?
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. హీరో అభి(నాగార్జున).. లేడీస్ బ్యూటీ ప్రోడక్ట్స్ ను తయారుచేసే కంపెనీకి ఎండీ. అతడికి అమ్మాయిలు అన్నా.. పెళ్లి అన్నా కోపం. చుట్టూ అమ్మాయిలతో పనిచేస్తున్న.. ఒక్కరిని కూడా పట్టించుకోడు. ఇక అదే కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్ గా హారిక(సోనాలి బింద్రే) వస్తుంది. ఆమెను ఎలాగైనా ఆ కంపెనీ నుంచి పంపించేయాలని అభి ప్లాన్ చేస్తాడు కానీ, కుదరదు. అలా వారు ఒక ప్రాజెక్ట్ కోసం ప్యారిస్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ వీరిద్దరూ ప్రేమలో పడతారు. అయితే తన ప్రేమను చెప్పేసమయానికే హారిక.. తనకు అప్పటికే ఎంగేజ్ మెంట్ అయ్యిందని చెప్తుంది. దీంతో అభి మనసు ముక్కలు అవుతుంది. ఇండియాకు వచ్చి.. అమ్మాయిలను తాను ఎందుకు హేట్ చేస్తాడో చెప్పుకొస్తాడు.. గతంలో అభి ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్లిపోవడంతో అమ్మాయిలపై కోపాన్ని పెంచుకున్న అభి.. చివరకు హారిక ప్రేమను తెలుసుకున్నాడా.. ? ఆమెను పెళ్లి చేసుకున్నాడా.. ? అనేది సినిమా. సినిమాలో ప్రతి డైలాగ్ ప్రేక్షకులకు కంఠస్తం వచ్చేలా ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్స్ లానే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న దేవినా ఇలాంటి ఆల్బమ్ ఇచ్చింది అని షాక్ అవుతారు కూడా. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి.
