Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..

Manisha Koirala 300kb

Manisha Koirala 300kb

Manisha Koirala: నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని చూసి ప్రముఖ నటి మనీషా కొయిరాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. స్వస్థలం నేపాల్ అయిన ఆమె, అక్కడి వరద బాధితుల దయనీయ స్థితిని చూసి చలించిపోయి, తన సోషల్ మీడియా వేదికల ద్వారా బాధను పంచుకున్నారు. వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులవ్వడం, మౌలిక వసతులు ధ్వంసం కావడంపై ఆమె స్పందిస్తూ.. నా మాతృభూమి పడుతున్న కష్టాలు చూస్తుంటే గుండె పగిలిపోతోందని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు వెంటనే స్పందించి నేపాల్ ప్రజలకు, వరద బాధితులకు అవసరమైన ఆహారం, వైద్యం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాదు చైనా, భారత్ నేపాల్ కు అండగా ఉండాలని, తాను కూడా వ్యక్తిగతంగా సహాయక చర్యల్లో భాగస్వామిని అవుతున్నట్లు భావోద్వేగంగా తెలిపారు.

నేపాల్‌లో ప్రకృతి పెను విషాదం సృష్టించింది. ఇటీవల నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ వరదలలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. ఈ విపత్తు తన దేశంపై చూపిస్తున్న ప్రభావాన్ని చూసి భావోద్వేగానికి గురైన మనీషా కొయిరాలా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. నేపాల్‌కు భారత్, చైనాలు అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఈ విపత్తు కారణంగా నేపాల్‌ను పర్యాటకులకు దూరం చేయవద్దని, దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం ఎంతో కీలకమని ఆమె గుర్తుచేశారు. ఆగస్టు 26న నేపాల్ భారీ వరదలు సంభవించాయి. ఒక్కసారిగా ఉప్పొంగిన నీరు పర్వత ప్రాంతాల్లోని గ్రామాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులను తీవ్రంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా రసువా, నువాకోట్, ధాదింగ్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విపత్తు తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, ప్రతికూల వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్లు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

ఆగస్టు 30 నాటికి నేపాల్‌లో ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 781కు చేరినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. మరో 2,500 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న టిబెట్ ప్రాంతంలోనూ 16 మంది మరణించగా, వందలాది మంది గల్లంతైనట్లు సమాచారం. ఈ విపత్తులో పర్యాటకులు, తీర్థయాత్రికులు, విదేశీయులు కూడా గల్లంతైన వారిలో ఉన్నారు. దీంతో నేపాల్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కాఠ్మాండులో సద్గురు ఆధ్వర్యంలోని ఇషా ఫౌండేషన్ నిర్వహించిన ‘ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్’ కార్యక్రమంలో మనీషా కొయిరాలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నేపాల్ పరిస్థితిపై మాట్లాడుతుండగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పదేపదే ప్రకృతి విపత్తులు సంభవించడం వల్ల నేపాల్ ప్రజలు ఎదుర్కొంటున్న బాధను ఆమె ప్రస్తావించారు. తన దేశం ఇలాంటి విషాదాల నుంచి ఎప్పుడు బయటపడుతుందో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక వరదల అనంతరం నేపాల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్ సహా పలు దేశాలు సహాయక సామగ్రి, రెస్క్యూ సిబ్బంది, ఇతర సహాయాన్ని అందిస్తున్నాయి. అయితే కొండ ప్రాంతాల్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, కొత్తగా వరదలు వచ్చే ప్రమాదం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు సహాయక బృందాలకు సవాలుగా మారాయి. తాజా హెచ్చరికల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నేపాల్‌లో పుట్టి పెరిగిన మనీషా కొయిరాలాకు ఆ దేశంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ఈ విపత్తుపై ఆమె స్పందన మరింత భావోద్వేగాన్ని కలిగించింది.