Site icon NTV Telugu

Mangalavaaram: రేపే మంగళవారం పెయిడ్ ప్రీమియర్స్.. గెట్ రెడీ!

Mangalavaaram

Mangalavaaram

Mangalavaaram Paid Premieres bookings opened: అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన డార్క్ థ్రిల్లర్ మంగళవారం. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకి ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, నందిత శ్వేత, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా మేకర్స్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం పెయిడ్ ప్రీమియర్‌లను తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇక బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. ఈ రోజుల్లో, చాలా మీడియం-బడ్జెట్ సినిమాల విషయంలో తమ కంటెంట్ మీద నమ్మకం ఉండడంతో పెయిడ్ ప్రీమియర్‌లను అనౌన్స్ చేస్తున్నారు.

Vishwak Sen: షూటింగ్ లో విశ్వక్ సేన్ కాలికి గాయాలు?

ఈ క్రమంలో అజయ్ భూపతి మరియు మంగళవారం టీమ్ డిసెంబర్ 16న తెలుగు రాష్ట్రాల్లో అదే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. వారు ప్రకటించినట్లుగా, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళవరం కోసం పెయిడ్ ప్రీమియర్‌ల బుకింగ్‌లు తెఓపెన్ అయ్యాయ. మరి కాసేపట్లో తెలంగాణలో బుకింగ్ కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ నడుస్తోంది. ప్రీమియర్స్ సమయంలో మంచి మౌత్ టాక్ వస్తే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఇక అలానే జరుగుతుందని సినిమాపై టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. పెయిడ్ ప్రీమియర్స్ పాజిటివ్ బజ్‌ను సృష్టిస్తే సినిమా వసూళ్లు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఇక రేపు హైదరాబాద్ ఏఎంబీలో ఈ సినిమాను పలువురు సెలబ్రిటీలకు సైతం ప్రదర్శించనున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో అనే దాన్ని బట్టి అటు పాయల్ కెరీర్, మరో పక్క అజయ్ భూపతి కెరీర్ ఆధారపడి ఉన్నాయి.

Exit mobile version