Site icon NTV Telugu

Mandana Karimi: ఆ డైరెక్టర్ నన్ను గర్భవతిని చేసి వదిలేశాడు..

Mandanna

Mandanna

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గావ్యవహరిస్తున్న షో లాకప్. అతి కొద్దిరోజుల్లోనే ఈ షో టాప్ షోలలో ఒకటిగా నిలిచింది. ప్రతివారం తమను తాము కాపాడుకోవడానికి కంటెస్టెంట్లు తమ జీవితంలో ఉన్న రహస్యాలను ప్రేక్షకుల ఎదుట బయటపెట్టాలి. ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్లు తమ రహస్యాలను బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చారు. ఇక తాజాగా మోడల్ కమ్ నటి  మందనా కరిమి తన జీవితాల్లోని అతి పెద్ద రహస్యాన్ని చెప్పి కంటెస్టెంట్లతో పటు అభిమానులకు కూడా షాకిచ్చింది. తనను ఒక డైరెక్టర్ పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేసి మోసం చేసినట్లు చెప్పుకొచ్చింది. ” నా భర్తతో విడిపోయాక నేను ఒక ప్రముఖ డైరెక్టర్ తో సీక్రెట్ రిలేషన్ లో ఉన్నాను.

అతను ఎప్పుడు మహిళల హక్కుల కోసం పోరాడుతూ ఉండేవాడు. దీంతో అతడిపై ప్రేమ కలిగింది.  అతను  కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు. ఆ ఆతర్వాత ఇద్దరం ఒక్కటయ్యాం. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేశాం.. ముందు దీనికి ఒప్పుకొని నేను గర్భవతి అయ్యాక అతను నను వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ఘటన నన్ను డిఫ్రెష్ లోకి తీసుకెళ్లిపోయింది. ఆ సమయంలో నా స్నేహితులు, సన్నిహితులు నాకు ఎంతో ఓదార్పునిచ్చారు” అంటూ కన్నీరుమున్నీరయ్యింది. ఇక ఆమె వ్యధ వవిన్న కంటెస్టెంట్లు సైతం కంటతడి పెట్టుకున్నారు. ఇకపోతే మందాన 2017లో వ్యాపారవేత్త గౌరవ్‌ గుప్తాను వివాహమాడింది. కొన్నేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తరువాత విబేధాల వలన విడిపోయారు. అయితే ఇప్పుడు తాజాగా మందాన ను మోసం చేసిన ఆ డైరెక్టర్ ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Exit mobile version