Site icon NTV Telugu

Manchu Case : జల్‌పల్లిలో మంచు వారి జగడం

Manchu

Manchu

మంచు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి రచ్చకు దారితీసింది. జలపల్లి లో ఉన్న తన ఇంట్లోని వస్తువులను కార్లను ఎత్తుకెళ్లాలని  పోలీసులకు ఫిర్యాదు చేసాడు మనోజ్. తాము ఇంట్లో లేని సమయం చూసి తన అన్న మంచు విష్ణు అతడి అనుచరులు తన ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మంచు మనోజ్. తన ఇంటికి తాను వెళ్తానని పోలీసులకు సమాచారం అందించాడు.

Also Read : Siddu Jonnalagadda : ఆరెంజ్ లా కాకుండా ‘జాక్’ ను ఇప్పుడే హిట్ చేయండి

నేడు తన కుటుంబంతో కలిసి జల్‌పల్లి నివాసానికి చేరుకున్నాడు మంచు మనోజ్. అయితే మనోజ్ సహా ఇంట్లోకి ఎవరికి అనుమతి లేదని ఆపేసారు అధికారులు. దాంతో ఇంటి బయట ఆందోళనకు దిగాడు మంచు మనోజ్. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని చెప్తున్నాడు. తన కారును తన సోదరుడు విష్ణు ఎత్తుకు వెళ్లడని, తనకు ఎక్కడ ఇల్లు లేనందున తన ఇంటికి వస్తున్నానని అధికారులకు తెలిపాడు మనోజ్. తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా కొద్దీ రోజుల క్రితం మనోజ్ భార్య తో కలిసి రాజస్థాన్ వెళ్ళాడు. నిన్న హైదరాబాద్ తిరిగి వచ్చిన మనోజ్ కుటుంబం తమ కారుతో పాటు మరికొన్ని వస్తువులు పోయాయని అనుచరులు ద్వారా తెలుసుకుని మంచు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఇదిలా ఉండగా నేడు మనోజ్ జల్‌పల్లి వస్తన్న నేపథ్యంలో ఇంటి వద్ద గొడవ జరిగే అవకాశం ఉండడంతో మంచు ఇంటికి భారీగా చేరుకున్నారు పోలీసులు. గత కొద్దీ నెలలుగా సాగుతున్న ఈ మంచు వారి మంటలు ఎప్పుడు చల్లారతాయో చూడాలి.

Exit mobile version