మోసగాళ్లు చిత్రం తరువాత మంచు విష్ణు హీరోగా కనిపించలేదు.. ఆ తరువాత మా ఎన్నికల్లో నిలబడడం, రాజకీయాలు.. మా ప్రెసిడెంట్ గా మారడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇక తాజాగా మరో కొటిట చిత్రంతో విష్ణు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు. తన కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ ని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గాలి నాగేశ్వరరావు గా మంచు విష్ణు నటిస్తున్నట్లు తెలుపుతూ ఒక కార్డు ని షేర్ చేశారు. ఈ సినిమాకు అదే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించనున్నారు. కథ, స్ర్కీన్‌ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగతా వివరాలను త్వరలోనే తెలపనున్నారు. మరి ఈ సినిమాతో మంచు విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Manchu Vishnu: గాలి నాగేశ్వరరావు గా మారిన ‘మా’ ప్రెసిడెంట్

Manchu-Vishnu