NTV Telugu Site icon

Manchu Vishnu: దమ్ముంటే ఆ బడా హీరో పేరు చెప్పు.. లేదంటే..

Manchu

Manchu

Manchu Vishnu:  మంచు ఫ్యామిలీ, మంచు విష్ణు గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగని రోజు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే మంచు విష్ణు మా ఎలక్షన్స్ నుంచి మరింత ట్రోలింగ్ వస్తువు గా మారిపోయాడు. దీనిపై మంచు ఫ్యామిలీ ఎప్పుడో సీరియస్ అయిన విషయం విదితమే.. తమ కుటుంబం పై వచ్చే ట్రోల్స్ ను భరించలేక పోలీసులను కూడా ఆశ్రయించారు. ఇక మా ప్రెసిడెంట్ గా విష్ణు గెలిచాకా ఈ ట్రోల్స్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం కూడా విదితమే.. తనను తన కుటుంబాన్ని బ్యాడ్ చేయడానికి ఒక బడా హీరో ఒక ఆఫీస్ పెట్టించి ట్రోల్స్ చేయించాడని, మా ఎలక్షన్స్ లో తనను గెలవకుండా చేయడానికి ఎన్నో కుట్రలు చేయించాడని చెప్పుకొచ్చాడు.  అయితే బడా హీరో పేరు మాత్రం చెప్పలేదు.. పేరు చెప్పండి అని అడిగినా ఇప్పటివరకు విష్ణు స్పందించింది లేదు.

ఇక తాజాగా జిన్నా ప్రమోషన్స్ లో బడా హీరో గురించి చెప్పుకొచ్చాడు. ” ఆ బడా హీరో చెప్పొచ్చు కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు..  అతను పెద్ద మేధావి.. అతని గురించి మీడియాకు తెలియదా..? మీకు తెలియదా..? నా నోటితో ఎందుకు చెప్పించాలనుకుంటున్నారు.. నేను అతని పేరు చెప్పి ఇండస్ట్రీ పరువు తీయాలనుకోవడం లేదు” అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో మరోసారి విష్ణు ట్రోలర్స్ చేతికి చిక్కాడు. మా ప్రెసిడెంట్.. దమ్ముంటే హీరో పేరు చెప్పు.. లేకపోతే ఏం మాట్లాడకుండా కూర్చో అని కొందరు.. అసలు బడా హీరో లేదు ఏం లేదు ఏదో ఫేమస్ అవ్వడానికి సోది చెప్తున్నాడు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక విష్ణు నటించిన జిన్నా సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.