Site icon NTV Telugu

Manchu Manoj : మంచు మనోజ్ – మౌనికల మూడేళ్ల ముచ్చటైన బంధం!

Manchu Manoj

Manchu Manoj

టాలీవుడ్ మోస్ట్ అడ్మైర్డ్ కపుల్స్‌లో మంచు మనోజ్ – భూమా మౌనికా రెడ్డి జంట ఒకటి. ఈ రోజు (మార్చి 3) ఈ జంట తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ, మనోజ్, మౌనికలను కలిపింది మాత్రం వారిలోని క్రమశిక్షణ మరియు జీవిత లక్ష్యాలే. పరిచయం కాస్తా ప్రేమగా మారి, మూడేళ్ల క్రితం వీరిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. నేడు ఇద్దరు పిల్లలు—కుమారుడు ధైరవ్, కుమార్తె దేవసేన శోభ ఎంఎంతో వీరి సంసారం ఎంతో సంపూర్ణంగా, ఆనందంగా సాగుతోంది. పెళ్లి తర్వాత మంచు మనోజ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుసగా ‘భైరవం’, ‘మిరాయ్’ వంటి చిత్రాలతో బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తన మాస్ ఇమేజ్‌ను మరోసారి చాటిచెప్పారు. ప్రస్తుతం ఆయన ‘డేవిడ్ రెడ్డి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Also Read : Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

ప్రోత్సహించేందుకు మనోజ్ ‘మోహన రాగ మ్యూజిక్’ లేబుల్‌ను ప్రారంభించి, తెలుగు సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భూమా మౌనిక కేవలం మనోజ్ భార్యగానే కాకుండా, ఒక సక్సెస్‌ఫుల్ అంట్రప్రెన్యూర్‌గా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ‘నమస్తే వరల్డ్ సెలబ్రేటింగ్ కిడ్స్’ సంస్థ ద్వారా స్వదేశీ బొమ్మల బ్రాండ్‌ను ఆమె విజయవంతంగా నడిపిస్తున్నారు. ఎటువంటి పెయిడ్ ప్రమోషన్లు లేకుండానే 75 వేల యూనిట్లకు పైగా బొమ్మలను విక్రయించారు. హామ్లీస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు రిలయన్స్‌తో పంపిణీ భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆమె వ్యాపార దక్షతకు నిదర్శనం. భారతీయ సంస్కృతి ప్రతిబింబించే బొమ్మలను ప్రతి బిడ్డ చెంతకు చేర్చడమే ఆమె లక్ష్యం. ఈ జంట కేవలం కెరీర్‌కే పరిమితం కాకుండా, సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటుంది. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనందించడం వీరిద్దరికీ అలవాటు. ఇక అభిమానులు వీరిని రాజకీయ తెరపై ఎప్పుడు చూస్తామా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తులో వీరి రాజకీయ అరంగేట్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version