Manchu Lakshmi : ఇప్పుడు థియేటర్లలో అన్నీ హిట్ సినిమాలే నడుస్తున్నాయి. సెప్టెంబర్ 5న వచ్చిన లిటిల్ హార్ట్స్ ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. ఇక 12న వచ్చిన తేజసజ్జ మిరాయ్ సినిమా దుమ్ములేపుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో థియేటర్లను కమ్మేసింది. ఎక్కడ చూసినా భారీగా ప్రేక్షకులతో థియేటర్లలు నిండిపోతున్నాయి. ఇక అన్నింటికీ మించి సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ మూవీ వస్తోంది. ఇలాంటి టైమ్ లో ఎవరూ తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు రిస్క్ చేయరు. కానీ మంచు లక్ష్మీ మాత్రం తన దక్ష మూవీని సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తోంది. ఇది చూసిన వారందరికీ ఒకింత ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. అనవసరంగా ఆమె రిస్క్ చేస్తుందా అనుకుంటున్నారు.
Read Also : Mahesh Babu – Allu Arjun : మహేశ్ బాబు వద్దన్న కథ.. బన్నీకి బ్లాక్ బస్టర్ హిట్..
ఎందుకంటే మిరాయ్ సినిమా వేవ్ ఇంకా తగ్గనే లేదు. పైగా పవన్ సినిమా ఆరు రోజుల్లో రాబోతోంది. అంత పెద్ద సినిమాల పోటీలో మంచు లక్ష్మీ సినిమాను పట్టించుకుంటారా.. అసలు ఆమె సినిమాపై ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తారా అని ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్. పైగా మూవీకి పెద్దగా బజ్ కూడా లేదు. పెద్ద స్టార్లు, పెద్ద డైరెక్టర్ లాంటివి కూడా లేవు. ఇలాంటి సినిమాలను సోలోగా రిలీజ్ చేసుకుంటే ప్రేక్షకుల దృష్టిలో పడే ఛాన్స్ ఉంటుంది. కానీ పెద్ద సినిమాల వేవ్ లో రిలీజ్ చేస్తే కొట్టుకుపోవడం ఖాయం అంటున్నారు సినిమా మేథావులు. ఈ విషయాలు మంచు లక్ష్మీకి తెలియనివి కావు. కానీ ఎందుకు ఇంత రిస్క్ చేస్తుందో ఆమెకు తెలియాలి.
Read Also : Ilaiyaraaja : చుక్కలు చూపిస్తున్న ఇళయరాజా.. మరీ ఇంత అవసరమా..?
