NTV Telugu Site icon

Manchu Lakshmi: మంచు లక్ష్మీకి ముద్దు ఇచ్చిన అల్లు హీరో.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

Sirish

Sirish

Manchu Lakshmi: మంచు వారి వారసురాలు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో మంచు లక్ష్మీపై ఏదో ఒక ట్రోల్ వస్తూనే ఉంటుంది. ఆమె వేషధారణ గురించో.. మాట్లాడిన మాటల గురించి ఏదో విధంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక అవేమి పట్టించుకోకుండా మంచు లక్ష్మీ తన జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవితం గడుపుతుంది. ఇక ఇండస్ట్రీలో లక్ష్మీ అందరికీ ఫ్రెండ్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో మంచు లక్ష్మీ స్నేహసంబంధాలు ఎక్కువే ఉన్నాయి. మంచు మోహన్ బాబు, చిరంజీవి మధ్య కొన్ని విబేధాలు ఉన్నాయని వార్తలు వచ్చినా.. వాటిని ఏమి పట్టించుకోకుండా వారసులు మాత్రం ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు. ఇక ఈ దివాళీకి మెగాస్టార్ చిరంజీవి పార్టీ ఇచ్చిన విషయం తెల్సిందే.

Radha Madhavam : ఆసక్తి రేకెత్తిస్తున్న ‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్

ఇక ఈ పార్టీలో మంచు లక్ష్మీ కూడా పాల్గొంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట మారాయి. అందులో ఒక ఫోటో మీదనే అందరి చూపు పడింది. అదేంటంటే.. మంచు లక్ష్మీ బుగ్గపై అల్లు శిరీష్ ముద్దు పెడుతున్న ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మంచు లక్ష్మీ.. మంచు కుటుంబానికే కాదు.. అల్లు, అక్కినేని కుటుంబాలకు కూడా అక్కనే. చై, అఖిల్, మనోజ్, శిరీష్ లు సైతం ఆమెను అక్క అనే పిలుస్తారు. ఇక ఈ పార్టీలో కూడా ఈ తమ్ముడు.. అక్కకు ముద్దు పెడుతూ కనిపించాడని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments