Radha Madhavam : ఆసక్తి రేకెత్తిస్తున్న ‘రాధా మాధవం’ ఫస్ట్ లుక్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radha Madhavam First Look: విలేజ్ లవ్ డ్రామా సినిమాలు ఇప్పటికీ చాలా మందికి హాట్ ఫేవరెట్. ఈ క్రమంలోనే తాజాగా మరో గ్రామీణ ప్రేమ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనల్ వెంకటేష్ ఒక అందమైన ప్రేమ కథా చిత్రం నిర్మిస్తున్నారు. ‘రాధా మాధవం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించగా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ క్రమంలో మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనంతరం రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారని, వినాయక్‌కు లీడ్‌గా ఇది రెండో సినిమా అని అన్నారు.
Family Star: సంక్రాంతి రేసు నుంచి విజయ్ దేవరకొండ అవుట్.. ?
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది, కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు, పోస్టర్ మాత్రం నాకు చాలా నచ్చింది, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తార’ని నమ్ముతున్నానని అన్నారు. హీరో వినాయక్ మాట్లాడుతూ ‘మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన రాజ్ కందుకూరికి థాంక్స్, వారి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి, ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలి, అందరూ మా సినిమాను చూడండని అన్నారు. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీతో పాటు మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!