మెగాస్టార్ చిరంజీవి, ట్యాలెంటేడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా పై.. చిరు అభిమానుల అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేలే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ విజయానంతరం, అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ ను చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్‌తో చూడబోతున్నాడు. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు కాబట్టి, ఈ సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. ఇక తాజాగా నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ గ్లింప్స్‌ను అధికారికంగా ప్రకటించారు.
Also Read : Dharma Mahesh : ప్రెగ్నెంట్ టైంలో నన్ను చంపాలని చూశాడు.. హీరో ధర్మ మహేష్ బండారం బయటపెట్టిన భార్య గౌతమి
చిరంజీవి ఒరిజినల్ పేరు ‘శివశంకర వరప్రసాద్’ నుంచి స్ఫూర్తి తీసుకొని, ‘మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు’ అని టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ సందర్భంగా విడుదలైన గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్‌లో మిక్స్ రెస్పాన్స్ తెచ్చింది. అయితే చాలా మంది చిరంజీవి స్టైలిష్ లుక్‌ను ఆస్వాదించగా, కొంతమంది మాత్రం ‘నేచురల్ లుక్ లేదు, డూప్ వాడినట్లుగా అనిపిస్తోంది” అని కామెంట్ చేశారు. గ్లింప్స్‌లో మెగాస్టార్ నడిచే వింటేజ్ స్టైల్‌ను ఇమిటేట్ చేసినట్టు అనిపించడం వల్ల డివైడ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇలాంటి డిస్కషన్స్ మధ్య, అనిల్ రావిపూడి మీడియా సమావేశంలో స్పష్టత ఇచ్చారు.. “ఈ సినిమాలో ఎలాంటి VFX లేదు. 95 శాతం వరకు చిరంజీవి స్వయంగా నటించారు. ఈ లుక్ కోసం ఆయన చాలా కష్ట పడ్డారు. వర్కౌంట్ లు కూడా చేశారు” అని తెలిపారు. మిగిలిన 5 శాతంలో డూప్ ఉపయోగించారా? అనే చర్చ సోషల్ మీడియాలో నెటిజెన్స్ మధ్య కొనసాగుతోంది. అంతే కాదు గ్లింప్స్ వీడియో కూడా ఆ 5 శాతంలో భాగమా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
