Site icon NTV Telugu

MSVG : మన శంకర వర ప్రసాద్ గారు.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ షురూ!

Manashankara Varaprasad Garu

Manashankara Varaprasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా. మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చిరంజీవిని అత్యంత స్టైలిష్‌గా చూపిస్తూ అనిల్ రావిపూడి కట్ చేసిన ప్రోమోలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సినిమాపై అంచనాలు పెంచడంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా చిరంజీవి-నయనతార జోడీ సాంగ్స్ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ అభిమానుల్లో జోష్ నింపింది.

ఇందులో మెగాస్టార్‌తో కలిసి విక్టరీ వెంకటేష్ స్టెప్పులేయడం థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉంది. అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్‌లో మంచి సక్సెస్ రేట్ ఉండటం, దానికి మెగాస్టార్ క్రేజ్ తోడవ్వడంతో ఈ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక మేకర్స్ సర్ప్రైజ్ ఇస్తూ  US లో 15 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించేశారు. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని, ఓవర్సీస్‌లో ‘సరిగమ సినిమాస్’ జనవరి 11నే గ్రాండ్ ప్రీమియర్ల ద్వారా విడుదల చేస్తుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Exit mobile version