Jr NTR: థియేటర్లలో గూస్‌బంప్స్ గ్యారెంటీ.. అఖిల్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్! ఎలాగో తెలుసా?

Jr Ntr

Jr Ntr

Jr NTR: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’. ఈ చిత్రం జూలై 10న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్కినేని అభిమానులతో పాటు సినిమా లవర్స్‌కు కిక్ ఇచ్చే ఒక సాలిడ్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా స్టార్టింగ్‌లో వచ్చే అత్యంత కీలకమైన ‘శ్రీరామపురం’, ‘భారతం మిట్ట’ అనే సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడానికి గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. తన పవర్‌ఫుల్ అండ్ బేస్ వాయిస్‌తో ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించినట్లు మేకర్స్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.

పరిచయం అక్కర్లేని ఆ గంభీరమైన వాయిస్‌తోనే ‘లెనిన్’ ప్రపంచం ప్రేక్షకులకు పరిచయం కాబోతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకు అతిపెద్ద అడ్వాంటేజ్‌గా మారిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్టీఆర్ అందించిన ఈ వాయిస్ ఓవర్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్), కింగ్ నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్) సంయుక్తంగా నిర్మించారు. జూలై 10న విడుదల కాబోతున్న ఈ సినిమాలో అఖిల్ సరికొత్త విశ్వరూపం చూడటానికి ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.