Jr NTR: థియేటర్లలో గూస్బంప్స్ గ్యారెంటీ.. అఖిల్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్! ఎలాగో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’. ఈ చిత్రం జూలై 10న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్కినేని అభిమానులతో పాటు సినిమా లవర్స్‌కు కిక్ ఇచ్చే ఒక సాలిడ్ అప్డేట్ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా స్టార్టింగ్‌లో వచ్చే అత్యంత కీలకమైన ‘శ్రీరామపురం’, ‘భారతం మిట్ట’ అనే సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడానికి గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. తన పవర్ఫుల్ అండ్ బేస్ వాయిస్‌తో ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించినట్లు మేకర్స్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.
పరిచయం అక్కర్లేని ఆ గంభీరమైన వాయిస్‌తోనే ‘లెనిన్’ ప్రపంచం ప్రేక్షకులకు పరిచయం కాబోతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకు అతిపెద్ద అడ్వాంటేజ్‌గా మారిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎన్టీఆర్ అందించిన ఈ వాయిస్ ఓవర్ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త గూస్బంప్స్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్టైన్మెంట్స్), కింగ్ నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్) సంయుక్తంగా నిర్మించారు. జూలై 10న విడుదల కాబోతున్న ఈ సినిమాలో అఖిల్ సరికొత్త విశ్వరూపం చూడటానికి ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Aasmaan : గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్!
- Suriya: ‘‘ఈ సక్సెస్‌ను నంబర్లతో కొలవలేం’’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ఎమోషనల్ కామెంట్స్!
- Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
- Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
A world born out of conviction.
Introduced by a voice that needs no introduction ❤️🔥❤️🔥❤️🔥Man of Masses @tarak9999 lends his voice to introduce Sriramapuram & Bharatham Mitta at the beginning of #LENIN 💥💥💥#LeninOnJuly10th @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna… pic.twitter.com/qP7ROGeJq6
— Sithara Entertainments (@SitharaEnts) July 6, 2026
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!