Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా.. మమ్ముట్టి దిగనంతవరకే.. ఆయన ఒక్కసారి పాత్రలో అడుగుపెట్టడా.. ? రికార్డులు గల్లంతే. సాధారణంగా ఒక హీరో.. ఒకలాంటి పాత్రలే చేయకూడదని.. డిఫరెంట్ డిఫరెంట్ పాత్రల్లో చూడాలనుకుంటారు. ఇక మమ్ముట్టి.. అభిమానుల కోరికమేరకు.. నిత్యం కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రావడమే కాకుండా హిట్ కూడా అందుకోవడం విశేషం. ఇక మమ్ముట్టికి తమిళ్ లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుగులో కూడా అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ఏడాది ఏజెంట్ సినిమాలో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఈ సినిమా హిట్ అందుకోలేకపోయినా.. మమ్ముట్టి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక నేడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టినరోజు. దీంతో ఉదయం నుంచి ఆయన బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా మారుమ్రోగిపోతుంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు విషెస్ తెలుపుతున్నారు.
Viral Video : ఓరి నాయనో..సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు..
ఇక తాజాగా ఆయన నటించిన కొత్త చిత్రం భ్రమయుగం సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ చేసి మమ్ముట్టికి బర్త్ డే విషెస్ తెలిపారు. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చక్రవర్తి రామచంద్ర మరియు శశికాంత్ నిర్మిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ లో మమ్ముట్టి లుక్ ఆకట్టుకుంటుంది. 60 ఏళ్ళ ముసలి వ్యక్తిగా కనిపించాడు. బ్లాక్ అండ్ వైట్ కలర్ పోస్టర్ లో గరపట్టిన పళ్లు.. గడ్డం.. ఒక కుర్చీలో కూర్చొని నవ్వుతూ కనిపించాడు. సడెన్ గా ఆయనను చూస్తే మమ్ముట్టి అని చెప్పడం చాలా కష్టం. ఈ ఒక్క పోస్టర్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమైపోతుంది. మరి ఈ సినిమాతో మమ్ముట్టి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.