NTV Telugu Site icon

Malli Pelli Trailer: రంకు, ఉంచుకోవడంతో సహా మొత్తం చూపించేశారు

Naresh

Naresh

Malli Pelli Trailer: సీనియర్ నటుడు నరేష్- నటి పవిత్ర లోకేష్ మధ్య ఏర్పడిన అనుబంధం.. ఎన్ని వివాదాలకు దారితీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ళ వయస్సులో నరేష్ నాలుగో పెళ్లి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సెలబ్రిటీలు.. పెళ్లిళ్లు అయ్యి, పిల్లలు ఉన్నవారు.. వారిని వదిలేసి.. తమ ప్రేమ కోసం తిరుగుతూ మీడియా కంటపడి, ట్రోల్స్ పడుతూ.. కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక వీరి మధ్యలోకి నరేష్ మూడో భార్య ఎంట్రీ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. ఒకరి మీద ఒకరు ఘాటు ఆరోపణలు చేసుకుంటూ.. మీడియా ముందే కొట్టుకుంటూ కనిపించారు. ఇక ఇందులో అసలు నిజం ఏంటి..? ఎవరు.. ఎవరిని ప్రేమించారు.. ఎందుకు ప్రేమించారు.. గొడవలు, వివాదాలు ఎందుకు అయ్యాయి.. అసలు నరేష్- పవిత్ర రిలేషన్ లో ఏం జరిగింది..? అని తెలుసుకోవాలంటే మళ్లీ పెళ్లి సినిమా చూడాల్సిందే అంటున్నాడు ఎమ్ఎస్ రాజు. ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. ఒక రకంగా చెప్పుకోవాలంటే నరేష్ బయోపిక్. అలా అని చిన్నతనం నుంచి ఉండదు. కేవలం పవిత్ర, నరేష్ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది అనేదే ఈ సినిమా. నరేష్- పవిత్ర వారి పాత్రల్లో వారే కనిపించగా.. నరేష్ మూడో భార్య పాత్రలో వనితా విజయ్ కుమార్ కనిపించింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Suriya: నో.. ఈయన మా సూర్య కాదు.. ఇలా మారిపోయాడేంటి..?

కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నరేష్, పవిత్రను కలిసిన దగ్గరనుంచి పెళ్లి వరకు అన్ని విడమరిచి.. కాదు కాదు విప్పి చూపించేశారు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్న నరేష్ జీవితంలోకి పవిత్ర రావడం, ఆమెతో పరిచయం, అదికాస్తా ప్రేమగా మారడం, అది నచ్చని మూడో భార్య నరేష్ తో గొడవ, పవిత్రను.. కృష్ణకు పరిచయం చేయడం, మీడియా ముందు కనిపించడం, ఇలా ఒకటి కాదు.. వారిద్దరి జీవితాల్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ను నరేష్ ప్రేక్షకులకు చూపించాడు. అందుకు తగ్గట్టే సంభాషణలు, లొకేషన్స్ ను చాలా చక్కగా చూపించారు. ముఖ్యంగా నరేష్.. పవిత్ర గురించి మాట్లాడే మాటలు అయితే హైలైట్ గా మారాయి.. “మీడియా ముందు.. తనతో రిలేషన్ షిప్ ఉందని ఒప్పుకొంటే వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న.. అంటే ఆమెను ఉంచుకున్నారా సర్ అని.. మొగుడును ఉంచుకొని అతడితో రంకు చేస్తున్నావా అని ఆమెను అడుగుతారు” అని ఘాటైన డైలాగ్స్ వాడి.. ఆసక్తిని పెంచేశారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబును కూడా నరేష్ వదలలేదు.. వారితో పవిత్రకు ఎలాంటి బాండింగ్ ఉందో కూడా చూపించాడు. మొత్తానికి ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. మరి నరేష్ జీవితంలో జరిగింది ఏది నిజం..? ఏది అబద్దం..? అనేది తెలియాలంటే మే 26 న థియేటర్ కు వెళ్లి ఈ ముదురుజంట ప్రేమాయణాన్ని చూడాల్సిందే.