సీనియర్ నటుడు అయిన నరేష్,పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ఈ నెలలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదని సమాచారం.ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని సమాచారం.. ఈ నెల 24 లేదా 25న అమెజాన్ ప్రైమ్ లో మళ్ళీ పెళ్లి మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.తెలుగు తో పాటు కన్నడ వెర్షన్స్ ఒకే రోజు ఓటీటీ లో విడుదల కాబోతున్నట్లు సమాచారం.సీనియర్ నటుడు పవిత్రా లోకేష్ జంట కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్‌ను దృష్టి లో పెట్టుకొని దాదాపు రెండు కోట్ల కు మళ్ళీ పెళ్లి ఓటీటీ హక్కుల ను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకొన్నట్లు తెలుస్తుంది.గత కొంత కాలంగా నరేష్ మరియు పవిత్రా లోకేష్ జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు ఎం.ఎస్ రాజు ఈ మూవీ ని తెరకెక్కించినట్లు సమాచారం..
టీజర్స్ మరియు ట్రైలర్ తో తెలుగు ప్రేక్షకుల్లో మళ్ళీ పెళ్లి బాగా ఆసక్తిని రేకెత్తించింది.. కానీ ఆ ఆసక్తిని థియేటర్ల లో ప్రేక్షకులకు అందించడంలో విఫలం కావడంతో మళ్ళీ పెళ్లి డిజాస్టర్ గా మిగిలిందని సమాచారం.. తెలిసిన కథ కావడంతో ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయిందని తెలుస్తుంది.ఈ సినిమా కథ ఏమిటి అంటే..ప్రముఖ సినీ నటుడు నరేందర్ (నరేష్) వైవాహిక జీవితం అంత గొడవల తో నిండిపోయి ఉంటుంది. విభేదాల కారణంగా సౌమ్య సేతుపతి కి ఆయన దూరంగా ఉంటాడు. అతడి జీవితం లో మరో నటి పార్వతి ఎలా వచ్చింది.వారి ప్రేమ బంధానికి సొసైటీతో పాటు సౌమ్య సేతుపతి నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నది మళ్ళీ పెళ్లి మూవీ స్టోరీ . ఈ సినిమాలో శరత్‌బాబు, వనిత విజయ్‌కుమార్ మరియు జయసుధ ఇతర ప్రధాన పాత్రల్ని పోషించారు. ఈ సినిమా ను విజయకృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై నరేష్ స్వయం గా ఈ మూవీని నిర్మించారని తెలుస్తుంది.