NTV Telugu Site icon

Prithviraj Sukumaran: బాలీవుడ్ లో విలన్ గా మారిన మలయాళ హీరో

Pruthvi Raj Sukumaran

Pruthvi Raj Sukumaran

‘పృథ్వీరాజ్ సుకుమార్’ మలయాళంలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. ఏడాదికి అయిదారు సినిమాలని రిలీజ్ చేస్తూ, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం పృథ్వీరాజ్ కి అలవాటైన పని. గత కొంతకాలంగా హీరోగా హిట్స్ కొట్టడంతో పాటు దర్శకుడిగా కూడా హిట్స్ కొడుతున్న పృథ్వీరాజ్, తాజాగా విలన్ వేషం వేయడానికి సిద్ధమయ్యాడు. సౌత్ లో హీరోగా రాణిస్తున్న పృథ్విరాజ్, బాలీవుడ్ లో విలన్ రోల్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న యాక్షన్స్ ఎంటర్టైనర్ ‘బడే మియా చోటే మియా’ సినిమాలో పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నాడు. ‘బడే మియా చోటే మియా’ సినిమాలో పృథ్వీరాజ్ లుక్ ని రివీల్ చేస్తూ మేకర్స్ ట్వీట్ చేశారు. ‘కబీర్’ పాత్రలో పృథ్విరాజ్ నటిస్తుండడం ‘బడే మియా చోటే మియా’ సినిమాకి సౌత్ మార్కెట్ లో కలిసొచ్చే విషయమే.

2023 డిసెంబర్ లో రిలీజ్ అవ్వనున్న ‘బడే మియా చోటే మియా’ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా మొదలయ్యింది. ‘గూండే’, ‘సుల్తాన్’, ‘ఎక్ థా టైగర్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలని డైరెక్ట్ చేసిన ‘అలీ అబ్బాస్ జాఫర్’ ఈ మూవీకి తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే 1998లో ‘బడే మియా చోటే మియా’ అనే టైటిల్ తో ‘అమితాబ్ బచ్చన్’, ‘గోవింద’లు కలిసి ఒక సినిమా చేశారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న ఈ మూవీ ‘అమితాబ్ బచ్చన్’ సినిమాకి సీక్వెల్ గా రూపొండుతుందా? లేక అదే సినిమాకి రీమేక్ చేస్తున్నారా? లేక టైటిల్ మాత్రమే తీసుకోని ‘అలీ అబ్బాస్ జాఫర్’ స్టైల్ లో ఉండే కంప్లీట్ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ ని రూపొందిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Show comments