Site icon NTV Telugu

Abhinay Kinger : హీరోకు భయంకరమైన రోగం.. త్వరలోనే చనిపోతాడంట

Abhinay Kinger

Abhinay Kinger

Abhinay Kinger : ఈ నడుమ సినీ నటులు అనారోగ్యాలకు గురవుతూ దీన స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా ఓ హీరోకు భయంకరమైన రోగం వచ్చింది. ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతానని స్వయంగా చెబుతున్నాడు. ఆయన ఎవరో కాదు అభినయ్‌ కింగర్‌. ఈయన మలయాళ హీరో. ప్రముఖ నటి టి.పి.రాధామణి కొడుకు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్నాడు. అభినయ్‌ తళుల్లువదో ఇళమై సినిమాతో యాక్టర్ గా పరిచయం అయ్యాడు. జంక్షన్‌ అనే తమిళ సినిమాలో హీరోగా కూడా చేశాడు. ఆ తర్వాత వరుస సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ సౌత్ లో మంచి గుర్తింపు సాధించాడు. కానీ కాలం ఆయన్ను దారుణంగా మార్చేసింది.

Read Also : Vijay Deverakonda : ఏంటీ.. అర్జున్ రెడ్డి కోసం విజయ్ ఇంతే తీసుకున్నాడా..

ఆయన కొంత కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇంకోవైపు ఫైనాన్షియల్ పొజీషన్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఒక చిన్న ఇంట్లో ఉంటూ ప్రభుత్వం నడిపిస్తున్న క్యాంటీన్ లో తింటున్నాడు. ఆయన దీన స్థితి గురించి తెలుసుకున్న తమిళ కమెడియన్ కేపీవై బాలా అభినయ్ ను కలిసి పరామర్శించాడు. అతనికి లక్ష రూపాయల సాయం చేశాడు. ఈ సందర్భంగా అభినయ్‌ తాను ఏడాది మాత్రమే బతుకుతానని ఎమోషనల్ అయ్యాడు. తనకు వేరే దారి లేదని ఏడ్చేశాడు. నువ్వు త్వరగానే కోలుకుంటావ్.. మళ్లీ సినిమాలు చేస్తావ్ అంటూ కమెడియన్ కేపీవై బాలా అతన్ని ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Read Also : Kingdom : ఎన్టీఆర్ అన్న వల్లే టైటిల్ మార్చాను.. విజయ్ క్లారిటీ

Exit mobile version